Fouji: ప్రభాస్ సినిమాలో హాలీవుడ్ నటుడు
ప్రభాస్(Prabhas) హీరోగా హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ఫౌజీ. అనౌన్స్మెంట్ నుంచే ఫౌజీ(Fouji)పై అందరికీ భారీ అంచనాలేర్పడ్డాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ యుద్ధ సైనికుడిగా కనిపించనున్నట్టు సమాచారం.
మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఫౌజీ గురించి ప్రస్తుతం ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఫౌజీలో రజాకార్ల నేపథ్యంలో సాగే ఓ భారీ సీక్వెన్స్ ఉంటుందట. ఈ సన్నివేశం మూవీలోనే హైలైట్ గా నిలుస్తుందని సమాచారం. ఈ ఎపిసోడ్ లో ఎమోషన్స్ కు, యాక్షన్ కు పెద్ద పీట వేయబోతున్నారని టాక్.
దానికి సంబంధించిన సన్నివేశాల్ని మార్చిలో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఎపిసోడ్ లో ఓ కీలక పాత్ర ఉందట. ఆ పాత్ర కోసం ఓ ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ ను రంగంలోకి దిగుతున్నాడట. ఆ పాత్ర కోసం ఆ హాలీవుడ్ నటుడు దాదాపు ఆరు నెలలుగా సన్నద్ధమవుతున్నాడని తెలుస్తోంది. అయితే ఆ హాలీవుడ్ యాక్టర్ ఎవరనేది చిత్ర బృందం త్వరలోనే ప్రకటించనుందట.













