Hit Movies: 2025 ఉత్తమ చిత్రాలివే
కొత్త సంవత్సరం అన్నంత సేపు లేదు. అప్పుడే 2025 సగానికి పైగా వచ్చింది. ఇప్పటికే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఒకదాని తర్వాత మరొకటి బ్లాక్ బస్టర్లు అందుకుంటూ మంచి సినిమాలను అందిస్తున్నాయి. ఈ ఇయర్ ప్రతీ ఇండస్ట్రీ నుంచి పలు సినిమాలు రాగా వాటిలో ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో సినిమా బెస్ట్ గా నిలిచింది. అవేంటో చూద్దాం.
బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్(Akshay Kumar) నటించిన కేసరి2(Kesari2) సినిమా రాగా ఆ సినిమా రూ.129.14 కోట్లు కలెక్ట్ చేయడంతో పాటూ ఆడియన్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. టాలీవుడ్ నుంచి నాని(Nani) నిర్మించిన కోర్టు(Court) సినిమా కూడా రూ.58.15 కోట్లు కలెక్ట్ చేసి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.
కోలీవుడ్ నుంచి శశి కుమార్(Sasi Kumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ డ్రామా టూరిస్ట్ ఫ్యామిలీ(Tourist Family) మంచి హిట్ గా నిలవగా, మలయాళం నుంచి మోహన్ లాల్(Mohan Lal) సినిమా తుదరమ్ ఎంతోమంది ప్రశంసల్ని అందుకుంది. శాండిల్వుడ్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన అజ్ఞాతవాసి(Agnathavasi) సినిమా కూడా అందరి మన్ననలు పొంది మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమాలన్నీ చిన్న బడ్జెట్ తోనే తెరకెక్కినప్పటికీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమా సక్సెస్ కు కంటెంట్ ముఖ్యం కానీ బడ్జెట్ కాదని ఈ సినిమాలు ప్రూవ్ చేశాయి.






