Tamil Movies: హిట్ సినిమాలకు ప్రమోషన్స్ కావాల్సిందే!
ఈ రోజుల్లో ఎలాంటి సినిమాలకైనా ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎంత స్టార్ క్యాస్టింగ్ ఉన్నా సరైన ప్రమోషన్స్ లేకపోతే ఆ సినిమా ఆడియన్స్ వరకు వెళ్లడం లేదు. ఇప్పటికే పలు సినిమాలు దీన్ని ప్రూవ్ చేశాయి. ఈ ఏడాది ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam), తండేల్(Thandel) సినిమాలు ప్రమోషన్స్ వల్లే అంత పెద్ద హిట్లుగా నిలిచాయి.
ఇక అసలు విషయానికొస్తే ఈ వీక్ మొత్తం 4 సినిమాలు రిలీజవగా, రెండు తెలుగు, రెండు తమిళ సినిమాలొచ్చాయి. నాలుగింటిలో రెండు తమిళ సినిమాలకు మంచి టాక్ వచ్చింది. అందులో ఒకటి ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్(Return of the Dragon) కాగా, ధనుష్(Dhanush) దర్శకత్వంలో వచ్చిన జాబిలమ్మ నీకు అంత కోపమా(Jabilamma Niku Antha kopama) రెండోది.
ఈ సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ దక్కుతున్నప్పటికీ బుకింగ్స్ మాత్రం డల్ గా ఉన్నాయి. దానికి కారణం తెలుగులో ఈ సినిమాలకు ప్రమోషన్స్ డల్ గా ఉండటమే. ప్రమోషన్స్ సరిగా చేయకపోవడం వల్లే ఈ రెండు సినిమాలకు తెలుగులో బుకింగ్స్ డల్ గా కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా చిత్ర మేకర్స్ విషయాన్ని గ్రహించి ప్రమోషన్స్ వేగాన్ని పెంచితే బుకింగ్స్ పెరిగే అవకాశముంటుంది.













