హను మాన్.. మరో కార్తికేయ-2 కానుందా?
దేవుడికి సంబంధించిన సినిమాలొస్తే చాలు నార్త్ ఆడియన్స్ ఇప్పుడు ఊగిపోతున్నారు. కానీ బాలీవుడ్ డైరెక్టర్లు అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమాలు తీయడం లేదు. దీంతో వేరే భాషల నుంచి వచ్చిన సినిమాలు ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కార్తికేయ-2, కాంతార లాంటి సినిమాలు నార్త్ ను ఎలా ఊపేశాయో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు.
ఇప్పుడు హనుమాన్ కూడా నార్త్ ఆడియన్స్ మనసులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు నార్త్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారని ముందు నుంచి అంచనాలున్నాయి. దానికి తగ్గట్టే మంచి రిలీజ్, టాక్ కూడా రావడంతో హనుమాన్ కు అన్నీ కలిసొచ్చాయి. సంక్రాంతి టైమ్ లో రిలీజైన ఈ సినిమాకు బాలీవుడ్ లో పోటీగా చెప్పుకునే సినిమా లేకపోవడంతో ఈ సినిమాకు నార్త్ లో ఎక్కువ సంఖ్యలోనే థియేటర్లు దక్కాయి.
టాక్ బాగుండటంతో బాలీవుడ్ లో హనుమాన్ దూసుకెళ్తుంది. మొదటి రోజు రూ.2 కోట్లు రాబట్టిన హను మాన్ హిందీ వెర్షన్, రెండో రోజు రూ.4 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మూడో రోజుకు ఆ కలెక్షన్లు ఇంకా పెరిగి రూ.6 కోట్లు దాటడం విశేషం. మొత్తానికి ఇప్పటివరకు హనుమాన్ హిందీ లో రూ.12 కోట్ల మార్కును అందుకుంది. ఫుల్ రన్ లో హను మాన్ ఎంత వసూలు చేస్తుందో చూడాలి.













