నారప్ప లో హైలైట్స్ అవే..
గతంతో పోలిస్తే వెంకటేష్ ఇప్పుడు తన సినిమాల స్పీడు పెంచాడు. వెంకటేష్ హీరోగా రూపొందిన నారప్ప ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని మేలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహంచిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఇప్పటికే రివీల్ అయిన వెంకీ లుక్ తో ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. అయితే ఇందులో వెంకీ క్యారెక్టర్ ఏంటనేది ఇప్పటి వరకు ఎక్కడా రివీల్ చేయలేదు.
ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ అసురన్ చూసిన వారికి అయితే స్టోరీ గురించి ఒక ఐడియా ఉంటుంది కానీ తెలుగు ఆడియన్స్ కు మాత్రం వెంకీ క్యారెక్టర్ ఎలా ఉంటుందనే విషయమై సస్పెన్స్ గానే ఉన్నారు. అయితే ఇందులో వెంకీ క్యారెక్టర్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటుందని తెలుస్తుంది. నారప్ప గా మాస్ లుక్ తో ఉన్న సీన్స్ అన్నీ విజిల్స్ వేయిస్తాయి, అందులో వెంకీ నటన అద్భుతంగా ఉండనుందని చెప్తున్నారు.
అంతేకాదు, నారప్ప లుక్ తో పాటు మరో లుక్ లో కూడా వెంకీ ఈ సినిమాలో కనిపించనున్నాడు. త్వరలోనే ఆ లుక్ కు సంబంధించిన అప్డేట్ రానుంది. మాస్ క్యారెక్టర్ లో వెంకీ యాక్టింగ్ మరో లెవల్ లో ఉంటుందని సినీ సంబంధీకులు చెప్తున్నారు. వెంకీకి జోడీగా ప్రియమణి నటిస్తున్న ఈ సినిమా మీద రోజు రోజుకీ అంచనాలు భారీగానే పెరుగుతున్నాయి.













