టక్ జగదీష్ లో హైలైట్ అదే..
ఫ్యామిలీ, లవ్ సెంటిమెంట్ తో సినిమాలు రావడం కొత్తేమీ కాదు. ఈ తరహా కథల్ని జనాలకు కనెక్ట్ చేయడంలోనే డైరక్టర్ ప్రతిభ ఉంటుంది. అలాంటి దర్శకుల జాబితాలో శివ నిర్వాణ కూడా ఉన్నాడు. ఇంతకుముందు నాని ని నిన్ను కోరి చిత్రంలో వీర ప్రేమికుడిగా చూపించారు. ఆ మూవీలో అప్పటికే పెళ్లైన అమ్మాయి చుట్టూ నాని ప్రదర్శించే ఎమోషనల్ నటన అందరినీ మెప్పిస్తుంది. ఫలితం నిన్ను కోరి హిట్ అయింది.
తర్వాత నాగచైతన్య, సమంత జంటగా ప్రేయసితో, భార్యతో ఎమోషనల్ లవ్ లో ఉండే కుర్రాడిగా చైతూని కూడా గొప్పగా చూపించి, మంచి ఎమోషన్ క్రియేట్ చేసి బాక్సాఫీస్ వద్ద మరో హిట్ కొట్టాడు. ఈ నేపథ్యంలో టక్ జగదీష్ లో నాని ని ఎలా చూపించబోతున్నాడనే దానికి మొన్నే మచ్చుక గా టీజర్ ను వదిలారు. టక్కు తీయకుండానే పొలం బురదలోకి దిగి గునపం పట్టిన ఆవేశ పరుడిగా నాని ని ప్రెజెంట్ చేశాడు శివ నిర్వాణ. మరి ఆ ఆవేశం వెనుక కథేంటో సినిమా చూస్తే కానీ తెలీదు.
టక్ జగదీష్ లో అన్నదమ్ముల సెంటిమెంట్ అందరితో కంటతడి పెట్టిస్తుందని టాక్. అన్న కోసం తమ్ముడు, తమ్ముడి కోసం అన్న ఎమోషన్ సీన్స్ రక్తి కట్టిస్తాయని.. సినిమాకి హైలైట్ సీన్ వీటి నుంచే పుట్టిందని చెబుతున్నారు. సినిమాలో బ్రదర్ సెంటిమెంట్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా ఉంటుందని తెలుస్తుంది. షైన్ స్క్రీన్ బ్యానర్స్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.













