పుష్ప2.. అంచనాల విషయంలో తగ్గేదేలే అంటున్న టీమ్
అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు పుష్ప సినిమా ఇచ్చిన కిక్ అంతా ఇంతా కాదు. ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపుగా పుష్ప2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పుష్ప2 తో ఆడియన్స్ కు మరోసారి పూనకాలు తెప్పించేలా సుకుమార్, బన్నీ రెడీ అవుతున్నారు. పుష్ప2 ఎన్నో అంచనాల నడుమ ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతీ అప్డేట్ ఫ్యాన్స్ కు అంచనాలను పెంచుతూనే ఉంది. అయితే ఈ సినిమా విషయంలో వస్తున్న హైప్ బాగున్నప్పటికీ అంచనాలు మరీ ఎక్కువై, తర్వాత వాటిని అందుకోలేకపోతే మాత్రం రిజల్ట్ తేడా రావడం ఖాయం. అందుకే పుష్ప2ను అన్ని వర్గాల ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యేలా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్.
అయితే ఇలా ఎక్కువ అంచనాలు ఉండటం వల్ల సినిమాలో ఎన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నా అవి ఆడియన్స్ కు అంత కిక్ ఇవ్వలేవు. అందుకే ఈ హైప్ ను బ్యాలెన్స్ చేస్తూ సుకుమార్ పుష్ప 2 ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా చేస్తున్నప్పుడు సుకుమార్ ప్రతీదీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటాడు. అందుకే సుకుమార్ కాలిక్యులేషన్స్ ఎప్పుడూ మిస్ అవదు. పుష్ప2 విషయంలో కూడా పెరిగిన అంచనాలను తన క్రియేటివిటీతో సరిచేసి ఆడియన్స్ ను ఖుషి చేయనున్నాడట సుకుమార్. ఈ సినిమా కోసం హీరో, డైరెక్టర్ తో పాటూ ప్రతి ఒక్కరూ తమ బెస్ట్ వర్క్ ను ఇవ్వడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.













