లావణ్య త్రిపాఠికి జాక్‌పాట్
అందాల రాక్షసి.. లావణ్య త్రిపారి… ఇటీవల ఆమెకు జాక్‌పాట్ తగిలిందని సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ సరసన హీరోయిన్గా నటించే ఆఫర్ ఈ బ్యూటీని వరించిందని అన్నారు. ఇదిలా ఉండగా, పవన్ త్వరలో హరీశ్‌శంకర్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో ఆయన సరసన హీరోయిన్గా లావణ్య త్రిపాఠిని ఫైనల్ చేసినట్టు టాక్. అయితే శృతిహాసన్‌ను తీసుకోబోతున్నారనే టాక్ కూడా ఉంది. కానీ తాజాగా లావణ్యపేరు తెరపైకి రావటం విశేషం. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. లావణ్య సినిమాల విషయానికొస్తే.. ఇటీవల అర్జున్ సుందరం తో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఇటీవల తమిళంలో ఆధర్వ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగులో సందీప్‌కిషన్ సరసన ఎ1 ఎక్స్‌ప్రెస్‌లో నటిస్తోంది. స్పోర్ట్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో లావణ్య హాకీ ప్లేయర్‌గా కన్పించబోతోంది.













