ప్రీమియర్ల ఆలోచనలో హాయ్ నాన్న టీమ్
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న సినిమా హాయ్ నాన్న. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శృతి హాసన్ ఓ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా ద్వారా శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్ కు పరిచయమవుతున్నాడు. హాయ్ నాన్న ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 7న రిలీజ్ కానున్న హాయ్ నాన్న కోసం నాని తెగ ప్రమోషన్స్ చేస్తున్నాడు.
ఈ వీకెండ్ లో అమెరికా వెళ్లి అక్కడ కూడా సినిమాను ప్రమోట్ చేయనున్నాడు నాని. ఇదిలా ఉంటే హాయ్ నాన్న కు ఒక రోజు ముందుగానే ప్రీమియర్లు వేయాలని చూస్తున్నాడట నిర్మాత. ఇప్పటికైతే హైదరాబాద్ ఏఎంబీ లో ఒక షో ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఆరో తేదీ రాత్రి మరికొన్ని థియేటర్స్ తో పాటూ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్లు వేయాలని చూస్తున్నారట.
హాయ్ నాన్న పై ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి హైప్ ఉంది. దానికి తోడు ప్రీమియర్స్ వేస్తే షోలు ఫుల్ చేసే మార్కెట్ కూడా నానికి ఉంది. ఒక్కరోజు తేడాతో నితిన్ ఎక్స్ ట్రా సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి నాని సినిమాకు ప్రీమియర్లు వేయడమన్నది మంచి ఆలోచనే. యానిమల్ కలెక్షన్స్ తగ్గేలా కనిపించడం లేదు కాబట్టి ఒక్క రోజు ముందుగానే నాని సినిమాను మంచి టాక్ వస్తే రిలీజ్ రోజు కలెక్షన్స్ పెరగడానికి ఈ టాక్ బాగా ఉపయోగపడనుంది.













