ఫ్యామిలీ ఆడియన్స్ కు ఆప్షన్ లా హాయ్ నాన్న
ఈ వీక్ రిలీజ్ కాబోతున్న హాయ్ నాన్నకు ఓ టెన్షన్ పోయింది. యానిమల్ సినిమా యూత్ కంటెంట్‌తో ఉండటంతో మెయిన్ గా ఫ్యామిలీ ఆడియన్స్‌నే టార్గెట్ గా పెట్టుకున్న నానికి ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ కూడా లేదు. రణ్‌బీర్ కపూర్ వయొలెంట్ మాస్‌ని పిల్లలతో సహా చూసేందుకు ఫ్యామిలీస్ అంతగా ఇష్టపడట్లేదని థియేటర్ల దగ్గర సిట్యుయేషన్ చూస్తే అర్థమవుతుంది.
కాబట్టి ఇప్పుడు అలాంటి ఆడియన్స్ అందరికీ హాయ్ నాన్ననే ఛాయిస్ కానుంది. పాప సెంటిమెంట్ తో ఎమోషన్స్‌కు పెద్ద పీట వేస్తూ శౌర్యువ్ ఈ సినిమాను తీర్చిదిద్దాడు. దానికి తగ్గట్టే నాని కూడా సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్నాడు. వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చేశారు. సందీప్ రెడ్డి వంగాతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు.
ఇది కాకుండా రీసెంట్గా వెంకటేష్ తో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పటికే షూట్ చేశారు. అన్ని రాష్ట్రాలకు వెళ్లి సినిమాను ప్రమోట్ చేసి వచ్చాడు. నెక్ట్స్ వీకెండ్ లో అమెరికా వెళ్లి అక్కడి ప్రోగ్రామ్స్‌లో భాగం కాబోతున్నాడు. కాబట్టి, హాయ్ నాన్నకు మంచి టాక్ వస్తే ఓ రెండు వారాల పాటు ఎలాంటి ఢోకా ఉండదు. డిసెంబర్ 15న కూడా చెప్పుకోదగ్గ రిలీజ్ లు లేవు కాబట్టి అప్పుడు దీంతో పాటూ ఎక్స్ట్రా మూవీ కూడా మరో ఆప్షన్ గా ఉంటుంది.













