ఓవర్సీస్ లో మహేష్ తర్వాత నానినే!
నేచురల్ స్టార్ నానికి తెలుగు రాష్ట్రాలతో పాటూ ఓవర్సీస్ లో కూడా మంచి మార్కెట్ ఉంది. రీసెంట్ గా రిలీజైన నాని హాయ్ నాన్న సినిమా ఓవర్సీస్ లో వారం పూర్తి కాకముందే వన్ మిలియన్ క్లబ్ లోకి చేరింది. దీంతో మొత్తం నాని సినిమాలు 9 ఈ మైలురాయిని అందుకున్నాయి. గతంలో ఈగ, భలే భలే మగాడివోయ్, అంటే సుందరానికీ, జెర్సీ, నిన్ను కోరి, ఎంసిఎ, నేను లోకల్, దసరా సినిమాలు ఈ ఫీట్ ను సాధించాయి.
హాయ్ నాన్న లాంగ్ రన్ లో మరో మిలియన్ సాధించి ఫైనల్గా రెండు మిలియన్ మార్క్ ను అందుకుంటుందని బయ్యర్లు నమ్ముతున్నారు. ఇప్పటివరకు ఓవర్సీస్ లో మహేష్ బాబు చేసిన 11 సినిమాలు వన్ మిలియన్ మార్క్ ను అందుకోగా, మహేష్ తర్వాతి స్థానంలో నానినే ఉన్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే నానికి ఓవర్సీస్ లో ఎంత స్ట్రాంగ్ మార్కెట్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఎలాగూ సలార్ వచ్చే వరకు ఈ సినిమాకు ఎలాంటి బ్రేకులు లేవు కాబట్టి ఈజీగా రెండు మిలియన్ల మార్క్ ను అందుకునే ఛాన్సుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా హాయ్ నాన్న మంచి రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది. నిర్మాతలు దానికి తగ్గట్టే స్క్రీన్స్ పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి దసరా తర్వాత నాని హాయ్ నాన్న రూపంలో సాలిడ్ హిట్ అందుకున్నాడు.













