‘మహా సముద్రం’ లో ‘హే తికమక మొదలే’
శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్లో రూపొందుతోన్న ‘మహా సముద్రం’ సినిమా మీద టాలీవుడ్లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ఆర్ ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో ‘మహా సముద్రం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇన్టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతోన్న ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే మహా సముద్రం ట్రైలర్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.
చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం ఈ చిత్రానికి అతి పెద్ద అసెట్. ట్రైలర్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఇప్పటికే రిలీజైన సాంగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మహా సముద్రం థర్డ్ సింగిల్ `హే తికమక` లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్.
ఈ పాటలో రెండు జంటల ప్రేమ కథలు కనిపిస్తున్నాయి. శర్వానంద్ అను ఇమాన్యుయేల్, సిద్దార్థ్ అదితీ రావు హైదరీ జంట పక్షుల్లా ఈ పాటలో కనిపిస్తున్నారు. ఈ పాట ఎంత అద్భుతంగా ఉందో.. ఆ జోడి మధ్య కెమిస్ట్రీ కూడా అంతే అద్భుతంగా ఉంది.
హరి చరణ్, నూతన్ మోహన్ ఈ పాటను ఆలపించారు. కిట్టు వరప్రసాద్ సాహిత్యాన్ని అందించారు. ఇక మొత్తంగా `మహా సముద్రం` నుంచి మరో సూపర్ హిట్ సాంగ్ గా `హే తికమక` నిలిచింది.
ఇన్టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి ప్రవీణ్ కె.ఎల్ ఎడిటర్, కొల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్.
నటీనటులు:
శర్వానంద్, సిద్ధార్థ్, జగపతిబాబు, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ తదితరులు
సాంకేతిక వర్గం: రచన, దర్శకత్వం: అజయ్ భూపతి, ప్రొడ్యూసర్: సుంకర్ రామబ్రహ్మం, కో ప్రొడ్యూసర్: అజయ్ సుంకర, బ్యానర్: ఏకే ఎంటర్టైన్మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి, మ్యూజిక్: చైతన్య భరద్వాజ్, సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, ప్రొడక్షన్ డిజైనర్: కొల్లా అవినాశ్, ఎడిటర్: ప్రవీణ్ కె.ఎల్
యాక్షన్: వెంకట్, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్













