Pawan Kalyan: పవన్ పైనే ఆశలు పెట్టుకున్న హీరోయిన్లు

కొంతమంది ఎంత కష్టపడినా వారి కష్టానికి తగ్గ స్టార్‌డమ్ మాత్రం రాదు. ఎక్కువగా హీరోయిన్లు ఈ సమస్యను ఫేస్ చేస్తూ ఉంటారు. ప్రతీ సినిమాకీ కష్టపడటం, ఆ సినిమాపైనే ఆశలు పెట్టుకోవడం చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ముగ్గురు హీరోయిన్లు తమ ఆశలన్నింటినీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పైనే పెట్టుకున్నారు. వారే నిధి అగర్వాల్(Nidhhi Agerwal), ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan), రాశీ ఖన్నా(Raashi Khanna).
ముందుగా చెప్పుకోవాల్సింది నిధి అగర్వాల్. నిధి ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు పదేళ్లవుతున్నా అమ్మడి ఖాతాలో ఇస్మార్ట్ శంకర్(ismart shankar) తప్ప మరో హిట్ లేదు. మొత్తానికి తన అదృష్టం కొద్దీ పవన్ హీరోగా తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు(Hari hara Veeramallu) లో హీరోయిన్ గా ఎంపికైంది. జులై 24న రిలీజవుతున్న వీరమల్లుతో ఎలాగైనా సక్సెస్ అందుకుని స్టార్‌డమ్ ను అందుకోవాలని నిధి ఆశపడుతుంది.
వీరమల్లు తర్వాత పవన్ నుంచి రానున్న ఓజి(OG) సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. ప్రియాంక ఇప్పటికే తెలుగులో నాని(Nani)తో కలిసి రెండు సినిమాలు చేసింది కానీ స్టార్ హీరోతో నటించడం ఇదే మొదటిసారి. ఓజితో ప్రియాంక ప్రూవ్ చేసుకుంటే అమ్మడికి మరిన్ని స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలొచ్చే వీలుంది. వీరిద్దరితో పాటూ ఉస్తాద్ భగత్‌సింగ్(Ustaad Bhagath Singh) లో పవన్ తో కలిసి రాశీ(Raashi) స్క్రీన్ ను షేర్ చేసుకోనుండగా రాశీ కూడా ఈ సినిమాపై ఎన్నోఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన రాశీ చేతిలో ఇప్పుడు తెలుసు కదా తప్ప మరో పెద్ద ప్రాజెక్టు లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ హిట్టైతే రాశీ తిరిగి బిజీ అయ్యే అవకాశాలున్నాయి. మరి పవన్ ఈ భామల ఆశలను నెరవేరుస్తాడో లేదో చూడాలి.