ప్రమోషన్స్‌లో కనిపించని హీరోయిన్లు
సినిమాకు పని చేసిన హీరో అయినా హీరోయిన్ అయినా, మరే ఇతర టెక్నీషియన్ అయినా సరే సినిమా రిలీజ్ వరకు దాన్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది. మరీ ముఖ్యంగా హీరో హీరోయిన్ కచ్చితంగా ప్రమోషన్స్ లో పాల్గొనాల్సిందే. లేదంటే ఆ లోటు ఆడియన్స్ కు చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
త్వరలోనే రిలీజ్ కాబోయే హాయ్ నాన్న సినిమా ప్రమోషన్స్ లో నాని తప్ప మృణాల్ కనిపించడం లేదు. స్టార్టింగ్ లో కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు కానీ రిలీజ్ దగ్గర పడుతున్న టైమ్ లో మాత్రం మృణాల్ హ్యాండ్ ఇచ్చింది. దానికి కారణం మృణాల్ ఫ్యామిలీ స్టార్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటమే. దీంతో హాయ్ నాన్న ప్రమోషన్ల బాధ్యత నాని ఒక్కడిపైనే పడింది. డైరెక్టర్ కూడా కొత్త అతను కాబట్టి నాని ఒక్కడే ప్రమోషన్స్ కోసం విశ్రాంతి లేకుండా తిరిగేస్తున్నాడు.
మరోవైపు శ్రీలీలకు కూడా అదే ప్రాబ్లమ్. రీసెంట్ గా రిలీజైన ఆదికేశవ సినిమాకు అసలు బజ్ రావడానికి కారణం శ్రీలీలనే. కానీ ఆ సినిమా ప్రమోషన్స్ లో ఎక్కడా శ్రీలీల కనిపించలేదు. దానికి కారణం అమ్మడి బిజీ షెడ్యూల్. ఎక్స్ట్రా మూవీ సాంగ్ షూటింగ్ వల్ల శ్రీలీల ఆదికేశవ ప్రమోషన్స్‌కు రాలేకపోయింది. దీంతో ఆ భారమంతా వైష్ణవ్ తేజ్, నిర్మాత నాగవంశీపై పడింది. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆదికేశవ నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది.
రాజమౌళి చెప్పినట్లు ఒక సినిమా మన చేతుల్లో ఉన్నంతవరకే దాన్ని ఏదైనా చేయగలం. ఒక్కసారి సినిమా మన చేయి దాటి రిలీజ్ అయితే ఆ సినిమాకు మనమేమీ చేయలేమని చెప్తుంటాడు. కాబట్టి ఇక నుంచి నిర్మాతలు హీరో, హీరోయిన్ల డేట్స్ తీసుకునేటప్పుడే ప్రమోషన్స్ కు కూడా సపరేట్ గా కాల్షీట్స్ ను అరేంజ్ చేసుకునేలా మాట్లాడుకుంటే బెటర్ అని సినీ విశ్లేషకులు అంటున్నారు.













