సినిమాలో కేథరిన్ ఉందా? లేదా?
బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న మెగా మూవీ వాల్తేరు వీరయ్య. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. శృతి తో పాటు ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కేథరిన్ కూడా నటిస్తున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.
అయితే కేథరిన్ క్యారెక్టర్ రవితేజకు జోడీ అనుకున్నారంతా. కానీ ఇప్పటి వరకు వాల్తేరు వీరయ్యలో ఆమె క్యారెక్టర్‌కు సంబంధించిన ఫోటో కానీ, విజువల్ కానీ రిలీజ్ అయింది లేదు. దీంతో అసలు కేథరిన్ క్యారెక్టర్‌ను సినిమాలో ఉంచారా లేదా ఎడిటింగ్‌లో లేపేసారా అనే డౌట్లు ఎక్కువవుతున్నాయి.
దీనికి కారణమూ లేకపోలేదు. చిరంజీవి ఆచార్య సినిమాలో కాజల్ నటించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆమె పాత్రను పూర్తిగా తొలగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాగే కేథరిన్ క్యారెక్టర్‌ను కూడా లేపేసారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రవితేజ పాత్ర నిడివి ఎక్కువగా ఉండటం వల్ల కేథరిన్ క్యారెక్టర్‌ను తొలగించారేమో అనే సందేహాలు కూడా నెటిజన్లు వెల్లబుచ్చుతున్నారు.
అయితే సినిమాలో ఆమె క్యారెక్టర్ ఉంటే మాత్రం, చిన్న క్యారెక్టరే అయినా అయినా ఆమెకున్న క్రేజ్‌ను వాడుకునేందుకు ఓ పోస్టర్‌ను అయినా రిలీజ్ చేసి ఉండాల్సింది. కానీ ఇప్పటివరకు ఆమెకు సంబంధించిందేదీ రివీల్ చేయలేదు చిత్ర యూనిట్. కనీసం ట్రైలర్లో అయినా ఆమెను చూపిస్తారేమో చూడాలి. ఈ విషయంలో మరికొన్ని రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.













