The Paradise: ప్యారడైజ్ లో వేశ్య పాత్రలో హీరోయిన్?
నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా శ్రీకాంత్ ఓదెల(Srikantha Odela) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ది ప్యారడైజ్(The Paradise). ఇప్పటికే నాని, శ్రీకాంత్ కాంబినేషన్ లో గతంలో దసరా(Dasara) సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అవడంతో ది ప్యారడైజ్ పై అందరికీ ముందు నుంచే భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే మొన్నామధ్య సినిమాను అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ టాలీవుడ్ మొత్తం దాని గురించి మాట్లాడుకునేలా చేసింది.
కాగా సినిమాలో నాని చాలా కొత్త లుక్ లో కనిపిస్తుండగా ఈ సినిమాలో నాని సరసన ఎవరు నటిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో డ్రాగన్(Dragon) తో సూపర్ హిట్ ను అందుకున్న అసోం బ్యూటీ కయాదు లోహర్(Kayadhu Lohar) హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ది ప్యారడైజ్ లో హీరోయిన్ పాత్రపై కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ది ప్యారడైజ్ లో హీరోయిన్ వేశ్యగా కనిపిస్తుందని, అందులో భాగంగానే ఎక్కువ స్కిన్ షో తో పాటూ బోల్డ్ సీన్స్ లో కూడా నటించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇన్నవీ తెలిసి కూడా కయాదు వెంటనే సినిమాకు ఓకే చెప్పిందని అంటున్నారు. అయితే వీటిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్తలు నిజమై, కయాదు పాత్ర ఆడియన్స్ కు కనెక్ట్ అయితే మాత్రం అమ్మడి కెరీర్ దశ తిరిగినట్టే. చూడాలి మరి ఏం జరుగుతుందో.







