Naga Chaitanya: చైతూ సినిమాకి హీరోయిన్ సమస్య
అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaithanya) ప్రస్తుతం తండేల్(Thandel) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఫిబ్రవరి 7న తండేల్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. తండేల్ తర్వాత చైతన్య విరూపాక్ష(Virupaksha) ఫేమ్ కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary)ని అనుకున్నారు.
కానీ రెమ్యూనరేషన్ విషయంలో సమస్యలు రావడంతో ఆమెను పక్కనపెట్టి శ్రీలీలను తీసుకోవాలనుకున్నారు. అసలే శ్రీలీల(Sree Leela) ఇప్పుడు మంచి ఫామ్ లో ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో కూడా శ్రీలీల ఛాన్సులందుకుంటూ కెరీర్లో ముందుకు దూసుకెళ్తుంది. కార్తీక్ దండు గురువు సుకుమార్(Sukumar) సలహా మేరకు శ్రీలీలని తీసుకోవాలని దర్శకనిర్మాతలు భావించారట.
కానీ ఇప్పుడు శ్రీలీల డేట్స్ ప్రాబ్లమ్ వల్ల మొదట అనుకున్న మీనాక్షి వైపే చూస్తుందట చిత్ర యూనిట్. అయితే మీనాక్షి రీసెంట్ గా వరుస హిట్లు అందుకుని తన పారితోషికాన్ని బాగా పెంచేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఆలోచనలో పడ్డట్టు సమాచారం. మరి చైతూ- కార్తీక్ కాస్త లేటైనా శ్రీలీల కోసం వెయిట్ చేస్తారా లేదా ఎక్కువ పారితోషికమైనా సరే ఇచ్చి మీనాక్షిని తీసుకుంటారా అనేది చూడాలి.













