సోషల్ మీడియాలో ఆకతాయిల వేధింపులు.. అరెస్ట్ చేసిన పోలీసులు
‘అవును’ చిత్రంతో హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకోవడమే కాదు, దెయ్యం సినిమాలు తియ్యాంటే నిర్మాతలు ఆమెనే సంప్రదించేవారు. ఆమె ఎవరో కాదు పూర్ణ. ఆమె అసు పేరు షామ్నా కాసిం. ‘అవును’ తర్వాత ఆ తరహా సినిమాలు చాలా చేసింది. అయితే రొటీన్‌గా మారిపోతోందని కొన్ని సినిమాలను తిరస్కరించింది కూడా. అయితే ఈమధ్య సినిమాలు ఏమీ లేకపోవడం, లాక్డౌన్ విధించడంతో కేరళలోని సొంతవూరు కోచిలో ఉంటోంది. కొన్ని మయాళ చిత్రాలను అంగీకరించింది. అంతేకాదు ఆమెకు పెళ్లి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట.
ఇదిలా ఉంటే ఈమధ్యకాలంలో ఆమె నలుగురు ఆకతాయిల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. తరచూ ఆమెకు ఫోన్లు చేసి వేధించడం, డబ్బు ఇవ్వాలంటూ బెదిరించడం చేస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో ఆమెకు కొన్ని అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. కొంతకాలం ఓపికగా భరించిన పూర్ణ చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఆ నలుగురు యువకులు బెంగళూరుకు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు ఆ ఏరియా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన బెంగళూరు పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. గతంలో కూడా సోషల్ మీడియాలో చాలా మంది అమ్మాయిలతో వారు అసభ్యంగా ప్రవర్తించారని పోలీసుల విచారణలో తేలింది.













