అఖండ2… హీరోయిన్ ఛాన్స్ ఎవరికిస్తారో?
బాలకృష్ణ- బోయపాటి ఈ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీరి కాంబోలో ఏ సినిమా వచ్చినా సరే అది మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ అందిస్తుంది. సింహా నుంచి అఖండ వరకు వీరి కలయికలో వచ్చిన ప్రతి సినిమా ఒక దానికి మించి మరొకటి సక్సెస్ అయింది. వీటన్నింటిలో అఖండకు స్పెషల్ ప్లేస్ ఉంది. అందుకే ఆ సినిమాకు సీక్వెల్ గా బోయపాటితో కలిసి మరో సినిమా చేయాలని బాలయ్య ఫిక్స్ అయ్యాడు.
ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్న బాలయ్య, అది పూర్తి కాగానే బోయపాటితో కలిసి అఖండ2 ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. అయితే అఖండ2 లో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అఖండలో ప్రగ్యా హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయినా ప్రగ్యాకు మాత్రం ఆఫర్లేమీ రాలేదు.
ఇప్పుడు అఖండ2 లో మరి ఆమెకే హీరోయిన్ గా ఛాన్సిస్తారా లేదా వేరే హీరోయిన్ ను తీసుకుంటారా అని డిస్కషన్స్ నడుస్తున్నయి. అయితే అఖండ2లో వేరే హీరోయిన్ ను తీసుకోవాలనుకుంటే కాజల్ అయితే బాలయ్య పక్కన బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే వీరిద్దరూ కలిసి భగవంత్ కేసరిలో నటించారు. ఒకవేళ ప్రగ్యా హీరోయిన్ గా నటించినా, మరో స్పెషల్ ఎట్రాక్షన్ గా కాజల్ ను కూడా తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరి బోయపాటి హీరోయిన్ గా ఎవరిని ఫైనల్ చేస్తాడో చూడాలి.













