విశాల్ కు గాయాలు
ప్రముఖ నటుడు విశాల్‌కు షూటింగ్లో గాయాలయ్యాయి. టర్కీలో షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. దీంతో ఆయన ఎడమకాలు, చేయి విరిగాయి. హుటాహుటిన విశాల్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్న సమయంలో డూప్ లేకుండా నటిస్తున్న విశాల్‌కు ప్రమాదం జరిగినట్టు చిత్ర బృందం తెలిపింది. విశాల్‌కు ఇటీవలే హైదరాబాద్‌కు చెందిన అనీశాతో నిశ్చితార్థం జరిగింది. సెప్టెంబర్‌లో వీరి వివాహం జరగనుంది. విశాల్ తెలుగు వాడైనప్పటికీ తమిళ చిత్రరంగంలో స్థిరపడ్డారు. ఆయన నటించిన అన్ని చిత్రాలు తెలుగులోకి అనువాదం అవుతున్నాయి. కోలీవుడ్ నడిగర్ సంఘానికి అధ్యక్షునిగా ఆయన వ్యవహరిస్తున్నారు. విశాల్ ప్రమాద వార్త తెలియగానే సన్నిహిత నటులు ఆందోళన వ్యక్తం చేశారు. కొద్ది రోజులు విశ్రాంతి తర్వాత విశాల్ తిరిగి షూటింగ్లో పాల్గొనే అవకాశాలున్నాయి.













