అంగరంగ వైభవంగా వెంకటేష్ కూతురు వివాహం
దగ్గుబాటి వారి ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ప్రముఖ కథానాయకుడు వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్ రాజధాని జయపుర లోని ఓ హోటల్లో ఆశ్రిత- వినాయక్ రెడ్డి వివాహంతో ఒక్కటయ్యారు. ఈ ఇద్దరిదీ పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. వినాయర్ రెడ్డి హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు. పెళ్లికి నాలుగు రోజులు ముందే జయపుర చేరుకొనన్న ఇరు కుటుంబాలు ముందస్తు వేడుకలతో పాటు సంగీత్ కార్యక్రమాన్ని సందడిగా జరుపుకొన్నాయి. వివాహానికి పలువురు ప్రముఖులు హాజరై కొత్త జంటని దీవించారు. వెంకటేష్‌కి సన్నిహిత మిత్రుడైన బాలీవుడ్ కథా నాయకుడు సల్మాన్‌ఖాన్‌తో పాటు ఇతర పరిశ్రమలకి చెందిన పలువురు అతిథులు పెళ్లికి హాజరయ్యారు. రామ్‌చరణ్-ఉపాసన, నాగచైతన్య-సమంత జంటలు వేడుకలో సందడి చేశాయి. త్వరలో హైదరాబాద్‌లో వివాహ విందు కార్యక్రమాన్ని నిర్వహించనుంది దగ్గుబాటి కుటుంబం.













