ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఆర్జీవీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రకటన
ఒక విలక్షణ నటుడు.. ఒక విభిన్నమైన కథాంశంతో సినిమాలు చేసే దర్శకుడు ఆయన.. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటే అభిమానులకు అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. అలాంటి కాంబినేషన్యే ఉపేంద్ర, ఆర్జీవీలది. ఒకప్పుడు ఆయన సినిమాలు అంటే అందులో ఏదో ఒక కొత్త అంశం ఉండేది. ప్రతి సినిమాలో ఏదో ఒక ట్రెండ్ సెట్టింగ్ అంశం ఉండేది. అలాంటి దర్శకుడు కొంతకాలంగా మాత్రం కాంట్రవర్సీనే తన ప్రధాన అజెండాగా మార్చుకున్నారు. ప్రతీ విషయంలో ఏదో ఒక వివాదం సృష్టిస్తూ ఆయన తనని తాను లైమ్ లైట్లోకి ఉంచుకుంటున్నారు. ఆయనే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ మధ్యకాలంలో ‘బోల్డ్’ కంటెంట్‌నే ఆయన తన ప్రధాన అంశంగా పెట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఓ సెన్సేషనల్ హీరోతో సినిమా తీసేందుకు రెడీ అయ్యారు. ఆయన మరెవరో కాదు.. కన్నడ స్టార్ ‘ఉపేంద్ర’. సినిమాలు చేయడంలో ఉపేంద్రది ఒక విభిన్నమైన శైలీ ఉంటుంది. ఆయన సినిమాల్లో ఎవరూ ఊహించని విధమైన స్క్రీన్ ప్లేతో పాటు.. సమాజానికి ఓ మంచి సందేశం ఇచ్చే విధంగా కూడా ఉంటాయి.
అయితే చాలాకాలంగా ఉపేంద్ర సినిమాలకు దూరంగా ఉంటున్నారు. సరైన స్క్రిప్ట్‌లో ఆయన పని చేసేందుకు ఆయన ఎదురుచూస్తున్నారు. అయితే అలాంటి హీరోపై ఇప్పుడు దర్శకుడు ఆర్జీవీ కన్నుపడింది. ఇప్పటివరకూ అడల్ట్ కంటెంట్‌తో.. కాంట్రవర్షియల్ అంశాలతో సినిమాలు చేస్తున్న ఆర్జీవీ.. ఇప్పుడు యాక్షన్ ఎంటర్టైనర్కు శ్రీకారం చుట్టారు. ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విషెస్ చెప్పిన ఆర్జీవి.. త్వరలోనే ఆయనతో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాను రూపొందిస్తున్నట్లు ప్రకటన చేశారు. తమ కాంబినేషన్లో ఓ అదిరిపోయే సినిమా వస్తుంది అంటూ ఆయన స్పష్టం చేశారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ త్వరలోనే వస్తాయి అంటూ ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అని తెలియగానే.. అభిమానుల్లో ఉత్సహం రెట్టింపు అయింది. మరి ఈ సినిమాకు సంబంధించి ఆర్జీవీ త్వరలో ఎలాంటి అప్డేట్ ఇస్తారో వేచి చూడాల్సిందే.
ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా పాన్ ఇండియన్ సినిమా ‘కబ్జా’ మోషన్ పోస్టర్
ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా SSE ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై MTB నాగరాజు సమర్పణలో వస్తున్న పాన్ ఇండియన్ సినిమా కబ్జా. R చంద్రు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆర్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమాలో కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 18న ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. 1960ల నేపథ్యంలో తెరకెక్కుతున్న కబ్జా సినిమాలో పక్కా మాస్ అవతారంలో కనిపిస్తున్నారు ఉపేంద్ర. ఆయన లుక్ వైరల్ అయిపోయింది. చేతిలో కత్తి పట్టుకుని ఉపేంద్ర ఇచ్చిన పోస్ట్ అందర్నీ ఆకట్టుకుంటుంది. రవి బసృర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కబ్జా చిత్ర టీజర్ దీపావళికి విడుదల కానుంది. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.













