మరో ప్రయోగం చేయనున్న సూర్య..
ప్రయోగాలకు పెద్దపీట వేస్తుంటారు తమిళ అగ్ర హీరో సూర్య. భిన్న కథలు, పాత్రలతో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వాలని తపిస్తుంటారు. ఇప్పటికే పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ఆయన మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. అది కూడా బాలీవుడ్ ఎంట్రీ అని అంటున్నారు. ఎప్పటికప్పుడు డిఫరెంట్ గా సినిమాలు చేసే కోలీవుడ్ యాక్టర్ సూర్య త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆకాశమే హద్దురా సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న సూర్య, ప్రస్తుతం శివ దర్శకత్వంలో కంగువా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కంగువా తర్వాత సూర్య, సుధా కొంగరతో కలిసి తన 43వ సినిమాను చేయనున్నాడు.
దీంతో పాటూ వెట్రిమారన్ డైరెక్షన్లోవాడివాసల్ సినిమాలో కూడా సూర్య నటించనున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత సూర్య, బాలీవుడ్ డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాష్ డైరెక్షన్ లో నటించేందుకు రెడీ అవుతున్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. మహాభారతంలోని దానకర్ణుని ఇతివృత్తంతో ఓ సినిమా చేయాలని ఓం ప్రకాష్ అనుకుంటుండగా, ఆ సినిమాలో సూర్య నటించనున్నాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ఇద్దరి మధ్య డిస్కషన్స్ జరిగాయని, ఈ సినిమాకు కర్ణ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా గురించి అధికాఇక ప్రకటన త్వరలోనే ఉంటుందని తెలుస్తోంది. మరి సూర్య పురాణాలతో చేయబోయే ఈ సినిమాతో ప్రేక్షకుల్ని ఏ విధంగా మెప్పిస్తారో చూడాలి.













