ఈ పాత్ర నాకు రావడం ఓ అదృష్టం
దర్శకుడు హరీశ్ వచ్చి కథ చెప్పగా న్యాయం చేయగలనా? లేదా? అని ఆలోచించా. ఎందుకంటే ఓ మహానుభావుడి పాత్ర. ఓ తెలంగాణ దేవుడి పాత్ర కనుక. రెండురోజులు ఆలోచించి, ధైర్యం తెచ్చుకుని తప్పకుండా చేయాలని నిర్ణయించుకున్నా. ఈ పాత్ర నాకు రావడం ఓ అదృష్టంగా భావిస్తున్నా. ఈ కథలో బావోద్వేగాలన్నీ ఉన్నాయి అని శ్రీకాంత్ అన్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రూపొందిన సినిమా తెలంగాణ దేవుడు. శ్రీకాంత్, జిషాన్ ఉస్మాని, సంగీత ప్రధాన తారగణం. హరీశ్ వడ్త్యా దర్శకుడు. మహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మాత. నందన్రాజు బొబ్బిలి స్వరకర్త. ఈ సినిమా పాటలను హైదరాబాద్లో విడుదల చేశారు. దర్శకుడు నాతో కామేడీ చేయించకుండా నిజాయతీ కల టీచర్ పాత్ర చేయించారు అని బ్రహ్మానందం అన్నారు. శ్రీకాంత్ నా లక్కీ హీరో. ఆయన సినిమాతో నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు కావడం సంతోషం అని సంగీత అన్నారు.













