సిద్ధార్థ్ రీ ఎంట్రీ
హీరో సిద్ధార్థకు తెలుగులో తిరుగులేని క్రేజ్ ఉండేది. బొమ్మరిల్లు తర్వాత అనేక చిత్రాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కానీ ఆ సినిమాలేవీ కమర్షియల్గా నిలదొక్కుకోలేదు. మరోవైపు దర్శకత్వ విభాగంలో జోక్యం చేసుకుంటాడనే విమర్శలు సైతం ఆయనపై వచ్చాయి. నిజానికి సిద్ధార్థ్ వచ్చిందే దర్శకత్వ శాఖ నుండి కానీ, హీరో అయ్యాక కూడా తలదూర్చడంతో పలువురు దర్శకులు ఆయనతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపలేదు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మంచి పేరున్న సిద్ధార్థ్ ఆ తర్వాత దర్శికునిగా కూడా మారాడు. హీరోగా మాత్రం కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు కొంత విరామం తర్వాత మళ్లీ తెలుగు సినిమా చేస్తున్నాడని సమాచారం. ఆర్ఎక్స్ 100 సినిమాతో వెలుగులోకి వచ్చిన దర్శకుడు అజయ్ భూపతి తన తదుపరి చిత్రాన్ని శర్వానంద్ హీరోగా తీస్తున్నారు. ఇందులో మన హీరోగా సిద్ధార్థ్ నటించనున్నట్టు తెలిసింది. కరోనా లాక్డౌన్ అనంతరం ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.













