విడాకుల పై హీరో సిద్దార్థ్ సంచలన కామెంట్స్
సమంత నాగ చైతన్య విడాకుల వ్యవహారం మీద నెట్టింట్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. విడాకుల వ్యవహారానికి పుల్ స్టాప్ పడింది. తామిద్దరం ఇకపై భార్యభర్తలుగా ఉండబోమని, తామిద్దరం స్నేహితులుగానే ఉండబోతోన్నామని చెప్పుకొచ్చారు. సమంత నాగ చైతన్య విడాకుల వ్యవహారం మీద నెట్టింట్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. విడాకుల వ్యవహారానికి పుల్ స్టాప్ పడింది. తామిద్దరం ఇకపై భార్యభర్తలుగా ఉండబోమని, తామిద్దరం స్నేహితులుగానే ఉండబోతోన్నామని చెప్పుకొచ్చారు. తమ స్నేహబంధం ఎప్పటికీ నిలిచిపోతోందని అన్నారు. ఇక సమంత, చైతన్య విడాకుల వ్యవహారం మీద నాగార్జున స్పందించాడు. భార్యభర్తల మధ్య జరిగింది పర్సనల్ అని విడాకుల కారణాలను చెప్పకనే చెప్పేశాడు.
అయితే తాజాగా సిద్దార్థ్ చేసిన ఓ కామెంట్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. “One of the first lessons I learnt from a teacher in school…” Cheaters never prosper.” What’s yours?” అంటూ ట్వీట్ చేసాడు. సమంత నాగ చైతన్య విడాకుల వ్యవహారం నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. విడాకుల ఇష్యూ మీద ఆర్జీవీ, కస్తూరి శంకర్, కుష్బూ వంటి వారు స్పందించారు. అయితే వారంత కూడా చైసామ్ పర్సనల్ జీవితం మీద కామెంట్ చేస్తూ పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. కానీ సిద్దార్థ్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాను మొదటి సారిగా స్కూల్లో నేర్చుకున్న గుణపాఠం ఇదేనంటూ చెప్పుకొచ్చాడు. మోసం ఛేసింది ఎప్పటికీ బాగుపడదు అని సిద్దార్థ్ ఓ కొటేషన్‌ను షేర్ చేశాడు. మరీ మీరు? అని అడిగేశాడు. ఇక జనాలు మాత్రం సిద్దార్థ్ ట్వీట్‌ను డీ కోడ్ చేస్తున్నారు. ఇది ఎవరిని ఉద్దేశించి అయి ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు. సమంత మీద సెటైర్లు వేశాడా? అని నెటిజన్లు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. లోలోపల ఏదో జరుగుతోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సమంత,సిద్దార్థ్ ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. జబర్దస్త్ సినిమా సమయంలోనే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డట్టు, పెళ్లి వరకు వెళ్లినట్టు కథనాలు పుట్టుకొచ్చాయి. వాటిపై సమంత పరోక్షంగ స్పందించింది. తన జీవితం కూడా మహానటి సావిత్రిలా అయ్యేదంటూ, తృటిలో తప్పించుకున్నట్టు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.













