రజనీకాంత్ లేటెస్ట్ మూవీలో టాలీవుడ్ హీరో!
సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి ఈమధ్యకాలంలో ఆయన రేంజ్‌కి తగ్గట్టు కమర్షియల్ హిట్ అయిన సినిమా ఒక్కటి కూడా లేదు. ఒక విధంగా చెప్పాలంటే దాదాపు 10 సంవత్సరాలుగా రజనీకి అలాంటి సినిమా పడలేదు. శంకర్ కాంబినేషన్లో 2010లో చేసిన రోబో తర్వాత చేసిన ప్రతి సినిమా హై ఎక్స్‌పెక్టేషన్స్‌తోనే రిలీజ్ అవుతోంది. కానీ, ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఏ సినిమా రీచ్ అవ్వడం లేదు. రోబో తర్వాత పూర్తి స్థాయి హీరోగా చేసిన సినిమాలు ఏడు. ఈ ఏడు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయాయి. ఒక రేంజ్లో కలెక్షన్స్ వచ్చినప్పటికీ అది రజనీకాంత్ రేంజ్ కలెక్షన్ కాదు.
తాజాగా శివ దర్శకత్వంలో అన్నాత్తై అనే సినిమా చేస్తున్నాడు రజనీ. ఇంతకుముందు అజిత్ హీరోగా వీరం, వివేకం, విశ్వాసం, వేదాళం వంటి సూపర్‌హిట్ సినిమాలను రూపొందించాడు శివ. ఈ నాలుగు సినిమాల్లోనూ అజిత్ హీరోగా నటించడం విశేషం. ఈ సినిమాల్లో అజిత్‌ను ఒక రేంజ్లో చూపించాడు శివ. చాలా సంవత్సరాల తర్వాత అజిత్ కాకుండా మరో హీరోతో సినిమా చేస్తున్నాడు శివ. ఈ సినిమాలో రజనీకాంత్‌ను డిఫరెంట్ యాంగిల్లో చూపించేందుకు ట్రై చేస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ ఓ ముఖ్యపాత్రలో కనిపించబోతోంది. అలాగే ఖుష్బూ, మీనా కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే టాలీవుడ్లో ఇప్పుడిప్పుడే బిజీ హీరో అవుతున్న సత్యదేవ్ `అన్నాతై` చిత్రంలో ఓ ప్రాధాన్యం కలిగిన క్యారెక్టర్ చెయ్యబోతున్నాడట. దీనికి సంబంధించిన అన్ని చర్చలు పూర్తయ్యాయి. షూటింగ్ ప్రారంభించగానే సత్యదేవ్ జాయిన్ అవుతాడు. గతంలో ఈ క్యారెక్టర్‌ను గోపీచంద్ పోషిస్తున్నాడని వార్తలు వచ్చాయి. కానీ, తాను ఆ సినిమాలో నటించడం లేదని గోపీచంద్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు ఆ అవకాశం సత్యదేవ్‌ని వరించింది. ఈ సినిమా చేయడం తన కెరీర్‌కి ఎంతో ఉపయోగపడుతుందని సత్యదేవ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు.













