డబుల్ ఇస్మార్ట్.. రామ్ రెమ్యూనరేషన్ అంతా?
లైగర్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న పూరీ జగన్నాథ్ తన తర్వాతి సినిమాతో ఎలా అయినా బౌన్స్ బ్యాక్ చేయాలని చూస్తున్నాడు. ఇస్మార్ట్ శంర్ కథకు సీక్వెల్గా రాబోతున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాను రీసెంట్ గా మొదలుపెట్టి ఒక యాక్షన్ సీక్వెన్స్ ను కూడా పూర్తి చేశాడు పూరీ. మిగిలిన షూటింగ్ ను కూడా త్వరగా పూర్తి చేయాలని పూరీ అనుకుంటున్నాడు.
లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత కూడా తన స్టైల్ ను అసలు మార్చుకోకుండా అలాగే ముందుకు వెళ్తున్నాడు పూరీ. డబుల్ ఇస్మార్ట్ కోసం ఇంకొన్ని పాత్రలను పూరీ ఫైనల్ చేయాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ కు అసలు గ్యాప్ లేకుండా చకచకా ఫినిష్ చేయాలని చూస్తున్నాడట. ఇక అసలు విషయానికొస్తే హీరో రామ్ ఈ సినిమా కోసం గతంలో ఎప్పుడూ అందుకోనంత పారితోషకాన్ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
డబుల్ ఇస్మార్ట్ కోసం రామ్ ఏకంగా రూ.30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. రామ్ రేంజ్ ఈ రెమ్యూనరేషన్ చాలా ఎక్కువ అని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్ లో ఛార్మీ, పూరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను లిమిటెడ్ బడ్జెట్ లోనే నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అలాంటప్పుడు హీరోకే 30 కోట్ల రెమ్యూనరేషన్ అంటే అసలు ఏ విధంగానూ నమ్మశక్యం కావడం లేదు. మరోవైపు రామ్ మార్కెట్ కూడా గత రెండు సినిమాలుగా ఏ మాత్రం బాగలేదు. బోయపాటితో చేస్తున్న స్కంద హిట్ అయితే రామ్ కెరీర్ గ్రాఫ్ పెరిగే ఛాన్సులు పుష్కలంగా కనిపిస్తున్నాయి.













