గోవా వెళుతున్న ఇస్మార్ట్ శంకర్
రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ చిత్రం ఇస్మార్ట్ శంకర్. పూరి జగన్నాథ్, నటి ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 30 రోజుల పాటు హైదరాబాద్‌లో భారీ షెడ్యూల్ జరిపారు. తదుపరి చిత్రీకరణ కోసం యూనిట్ గోవా వెళుతోంది. అక్కడ మరో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. మేలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇతర పాత్రల్లో పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, అశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫ్టైట్స్: రియల్ సతీష్, పాటలు: భాస్కరభట్ల, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: రాజ్‌తోట.













