కులాల కుంపటిపై ‘రామ్’బాణం
బంధువుల ఆసుపత్రికి అన్యాయం జరుగుతోందంటూ ట్వీట్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో కాక పుట్టించిన సినీ హీరో రామ్.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పశ్చాత్తాపపడినట్టు కనిపించాడు. ఇకపై తానేమీ ఈ విషయంలో కల్పించుకోనని ప్రకటించాడు. ఇదంతా తెలిసిందే. అయితే తాజాగా రామ్ మరో ట్వీట్ చేశాడు. తాను చెప్పినట్టుగానే కోవిడ్ కేర్ సెంటర్ గురించి కాకుండా..కులాల కుంపట్లపై వ్యాఖ్యలు చేయడం విశేషం. ‘‘నా ప్రియమైన సోదరీ సోదరులారా… క్యాస్ట్ అనే వ్యాధి కరోనా కంటే వేగంగా విస్తరిస్తుంది. అది కరోనా కన్నా చాలా ప్రమాదకరమైన అంటువ్యాధి. దీనికి దూరంగా ఉండండి. మిమ్మల్ని నిశ్శబ్ధంగా అందులోకి లాగడానికి తోసేయడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు… గొప్ప మంచి కోసం కలిసి ఉందాం’’ కొందరు అంటూ రామ్ ట్వీట్ చేశాడు. తమ ప్రాంతంలో ఉన్న కుల పిచ్చి, తన వ్యాఖ్యల అనంతరం తన మీద కొందరు కుల ముద్ర వేయడానికి ప్రయత్నించిన నేపధ్యంలో రామ్ ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటాడని పలువురు భావిస్తున్నారు.













