పెళ్లి ఆలోచన ఇంకా లేదు
తనకు పెళ్లి చేసుకునే ఆలోచన ఇంకా లేదని సినీ హీరో నితిన్ అన్నారు. నితిన్, మేఘా ఆకాష్ జంటగా నటించిన చల్ మోహన్ రంగా చిత్ర బృందం గుంటూరులోని సిమ్స్ కళాశాలలో సందడి చేసింది. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు నిర్మాతలుగా, నితిన్ సొంత బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 5న విడుదల కానున్న ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలంటూ నితిన్ సిమ్స్ కళాశాల విద్యార్థులను కోరారు. చల్ మోహనరంగ చిత్రం వేసవిలో విద్యార్థులు సేదతీర్చడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గుంటూరు రావడం ఎంతో ఆనందంగా ఉందన్న నితిన్, గతంలో సై, అఆ చిత్రాల విజయయాత్రకు ఇక్కడకు వచ్చానని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి తనకు లేదని, వివాహం ఆలోచన ఇప్పుడిప్పుడే లేదని చెప్పారు. కొత్తగా మూడు చిత్రాలు అంగీకరించానని, దానికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని నితిన్ చెప్పారు.













