ఆడియన్స్కు సవాల్ విసిరిన నితిన్
మొన్నీ మధ్య వచ్చిన మ్యాడ్ సినిమాకు ఓ బంపరాఫర్ ఇచ్చాడు నిర్మాత నాగ వంశీ. జాతి రత్నాలు మూవీ కంటే మ్యాడ్ మూవీకి తక్కువ నవ్వితే టికెట్ డబ్బులు వాపస్ ఇచ్చేస్తానని సవాల్ చేశాడు. మ్యాడ్ మూవీలో కామెడీ బాగుండటంతో ఈ విషయంలో పెద్దగా కంప్లైంట్స్ రాలేదు. ఇప్పుడు నాగవంశీ లానే మరొకరు తన సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో ఇలాంటి సవాలే విసిరాడు.
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, మ్యాడ్ సినిమాను గుర్తు చేస్తూ ఈ సవాల్ చేశాడు. నితిన్ హీరోగా రానున్న ఎక్స్ట్రా మూవీ చూసి ఆడియన్స్ నవ్వకపోతే డబ్బులు నాగవంశీనే వాపస్ ఇస్తాడని, ఆయనకు తనకు చాలా లావాదేవీలున్నాయని నితిన్ నవ్వుతూ అన్నాడు. ట్విట్టర్లో నితిన్ మాటలు వైరల్ అవుతుండగా, నాగవంశీ దానికి స్పందించాడు.
నేనేదో ఆ రోజు అలా అన్నాని, తనను లాక్ చేస్తే ఎలా అని నితిన్ కు రిప్లై ఇచ్చాడు నాగవంశీ. ఒకసారి వర్కవుట్ అయిన మనీ వాపస్ సెంటిమెంట్ ఈసారి వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి. వక్కంతం వంశీ దర్శకత్వంలో శ్రీలీల హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.













