మీ పోరాటం వృథా కాదు : నారా రోహిత్
అమరావతి పరిరక్షణ కోసం రాజధాని రైతులు చేస్తున్న పోరాటం వృథా కాదని సినీ హీరో నారా రోహిత్ ట్వీట్ చేశారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల త్యాగం వెల కట్టలేనిది. విభజనతో జీవచ్చవంలా మిగిలిన రాష్ట్రానికి ప్రాణసమానమైన భూములను త్యాగం చేసి, అమరావతి రూపంలో ప్రాణం పోశారు. మీ ఔదార్యంతో అమరావతిలో పాలనకు బాటలు వేశారు. ఆ మార్గం చెదిరిపోకూడదని 23 రోజులుగా మీరు చేస్తున్న పోరాటం భావి తరాలకు స్ఫూర్తిదాయకం. ఉద్యమానికి సంకెళ్లు పడుతున్నా.. అలసిన గుండెలు మూగబోతున్నా.. మొక్కువోని దీక్షతో ముందుడుగు వేస్తున్నారు. మీ పోరాటం వృథా కాదు అని రోహిత్ ట్వీట్ చేశారు.













