నాని ముందు ఎన్నో ఆప్షన్స్
గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న నేచురల్ స్టార్ దసరా సినిమాతో బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ హిట్ ను అందుకోకపోయినా ఓ మోస్తరు హిట్ ను అందుకున్నాడు. దసరా సినిమా రిలీజ్ కు ముందే నాని శౌర్యువ్ అనే కొత్త డైరెక్టర్ తో హాయ్ నాన్న అనే సినిమాను మొదలు పెట్టిన విషయం తెలిసిందే. సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
హాయ్ నాన్న రిలీజ్ కాకముందే నాని మరో కొత్త సినిమాను మొదలుపెట్టనున్నాడని ఆ మధ్య వార్తలొచ్చాయి. కానీ దసరా రిజల్ట్ తో నాని మరికొంత టైమ్ తీసుకుని తన తర్వాతి సినిమాను ఎవరితో చేయాలనేది డిసైడ్ కానున్నాడు. అంటే సుందరానికీ ఫేమ్ వివేక ఆత్రేయ డైరెక్షన్ లో నాని మూవీ స్టార్ట్ కానుందని అప్పట్లో వార్తలొచ్చాయి.
కానీ వివేక్ చెప్పిన స్క్రిప్ట్ నానిని శాటిస్ఫై చేయకపోవడంతో మరో కొత్త కథను రెడీ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇందులో నిజమెంతన్నది మాత్రం తెలియదు. ఇదిలా ఉంటే నాని మరో తమిళ దర్శకుడితో కూడా సినిమా చేయనున్నాడని వార్తలొచ్చాయి. మరోవైపు దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో కూడా నాని ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. ఇలా నానికి తన ముందు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి కానీ వాటిల్లో ఏది బెస్ట్ అనేది ఆలోచించుకోవడానికి కొంత టైమ్ తీసుకోవాలనే యోచనలో నాని ఉన్నట్లు తెలుస్తోంది.













