K-Ramp’: “K-ర్యాంప్” టీజర్, ట్రైలర్ తో డీజే మిక్స్

తన సినిమాలను ప్రేక్షకులకు రీచ్ చేసేందుకు సాధ్యమైనంత కొత్తగా ప్రయత్నిస్తుంటారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఆయన తన లేటెస్ట్ మూవీ “K-ర్యాంప్”పై కూడా ఆడియెన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. గతంలో తన సినిమా “ఎస్ఆర్ కల్యాణమండపం”కు డీజే మిక్స్ చేసి ఆ కంటెంట్ ను వైరల్ చేశారు. ఇప్పుడు “K-ర్యాంప్” టీజర్, ట్రైలర్ తో డీజే మిక్స్ చేసి యూత్ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేస్తున్నారు. ఈ డీజే మిక్స్ “K-ర్యాంప్” మీద ఒక వైబ్ క్రియేట్ చేస్తోంది. టీజర్, ట్రైలర్ లో పేలిన డైలాగ్స్ అన్నీ ఈ డీజే మిక్స్ లో యాడ్ చేయడం కొత్త ఫీల్ కలిగిస్తోంది.
“K-ర్యాంప్” సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోంది. “K-ర్యాంప్” సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.