K-Ramp: “K-ర్యాంప్” విజయం ప్రత్యేకం- కిరణ్ అబ్బవరం
                                    సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన “K-ర్యాంప్” మూవీ హౌస్ ఫుల్ షోస్ తో పెరుగుతున్న కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ విజయం దిశగా పరుగులు తీస్తోంది. ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా థర్డ్ వీక్ ప్రదర్శితమవుతూ 40 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి దీపావళి బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచింది. “K-ర్యాంప్” సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించారు. జైన్స్ నాని దర్శకత్వం వహించారు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో “K-ర్యాంప్” ర్యాంపేజ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, నిర్మాత బండ్ల గణేష్ అతిథులుగా హాజరయ్యారు. అతిథుల చేతుల మీదుగా మూవీ టీమ్ కు జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా
ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ మాట్లాడుతూ – “K-ర్యాంప్” సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొనేందుకు వచ్చిన పెద్దలు అందరికీ థ్యాంక్స్. మా సినిమా రోజు రోజుకూ కలెక్షన్స్ పెంచుకుంటూ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. మా టీమ్ లో ఎవరూ తక్కువ ఎవరు ఎక్కువ కాదు, టీమ్ ఎఫర్ట్ పెట్టి కష్టపడ్డాం. మా కష్టాన్ని గుర్తించి మా సినిమాను ప్రేక్షకులు హిట్ చేయడం హ్యాపీగా ఉంది. అన్నారు.
ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి మాట్లాడుతూ – “K-ర్యాంప్” సినిమా కథను ఎంత ఎనర్జీతో చెప్పారో అంతే బాగా మా డైరెక్టర్ నాని రూపొందించారు. కిరణ్ గారి ఎనర్జీ వల్లే సినిమాకు ఇంత మంచి విజయం దక్కింది. ఈ టీమ్ అంతా కలిసి మరిన్ని మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
డీవోపీ సతీష్ రెడ్డి మాసం మాట్లాడుతూ – ఇలాంటి సక్సెస్ ఫుల్ మూవీలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. మేము ఎంత ఎఫర్ట్స్ పెట్టామో అంత పెద్ద విజయంతో ప్రేక్షకులు మాకు సంతృప్తిని ఇచ్చారు. కిరణ్ గారి సపోర్ట్ మాకు ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నా. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ మాట్లాడుతూ – ప్రేక్షకులు “K-ర్యాంప్”కు ఇచ్చిన పాజిటివ్ మౌత్ టాక్ వల్లే ఇలాంటి ఘన విజయం దక్కింది. ఒక మంచి సినిమాను ప్రేక్షకులు కాపాడారు. వాళ్లు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేము. “K-ర్యాంప్” వంటి సక్సెస్ ఫుల్ మూవీలో నేనూ ఒక భాగమైనందుకు గర్వంగా ఉంది. అన్నారు.
నటుడు మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ – “K-ర్యాంప్” సినిమాతో మరోసారి మీ ఆదరణ పొందడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలతో పాటు కిరణ్ గారికి థ్యాంక్స్. మా టీమ్ అందరికీ ప్రేక్షకులు పెద్ద విజయాన్ని అందించినందుకు ధన్యవాదాలు. అన్నారు.
డైరెక్టర్ జైన్స్ నాని మాట్లాడుతూ – “K-ర్యాంప్” అంటే కిరణ్ అబ్బవరం ర్యాంప్. ఈ సినిమాను థియేటర్స్ లో చూసి ఈలలు వేసి ప్రేక్షకులంతా ఎంజాయ్ చేశారు. నాపై నమ్మకంతో ఈ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం కల్పించారు కిరణ్ గారు. ఇది మా టీమ్ అందరి విజయం. ప్రతి ఒక్కరూ ఈ సక్సెస్ లో భాగమే. “K-ర్యాంప్” సినిమాకు పనిచేసిన టీమ్ అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెబుతున్నాను. అన్నారు.
ఫైట్ మాస్టర్ ఫృథ్వీ మాట్లాడుతూ – ఈ సినిమాకు మంచి ఫైట్ సీక్వెన్సులు డిజైన్ చేశాం. ఈ మూవీ సెట్ లో ఉన్నప్పుడే నాకు నేషనల్ అవార్డ్ వచ్చిందనే న్యూస్ తెలిసింది. మా టీమ్ అంతా ఆ సందర్భాన్ని సెలబ్రేట్ చేశారు. ఇండస్ట్రీలో నాకు మా ప్రొడ్యూసర్ రాజేశ్ గారు ఉన్నారనే ధైర్యం ఉంది. కిరణ్ గారితో కంటిన్యూగా మూవీస్ చేయడం హ్యాపీగా ఉంది. అన్నారు.
ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ – రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన “K-ర్యాంప్” సినిమాకు ప్రేక్షకులు మంచి విజయాన్ని అందించారు. ఈ సినిమాతో హీరో కిరణ్ మరో సంచలన విజయం సాధించడం హ్యాపీగా ఉంది. దర్శకుడు జైన్స్ నాని ప్రతిభావంతంగా సినిమాను తెరకెక్కించారు. ఈ టీమ్ ప్రేక్షకులకు వినోదాన్ని అందించే మరిన్ని మంచి చిత్రాలను రూపొందించాలని కోరుకుంటున్నా. ప్రొడ్యూసర్స్ రాజేశ్, శివలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ – యంగ్ అండ్ డైనమిక్ టీమ్ “K-ర్యాంప్” సినిమాను రూపొందించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను నేను కోరేది ఒక్కటే, చిన్న చిత్రాలను ఆదరించండి. ఇలాంటి టీమ్ కు ప్రేక్షకుల ఆదరణ, ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.
నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ – సినిమా ఇండస్ట్రీకి రావాలనుకునే తన కలను పట్టుదలతో కష్టపడి నెరవేర్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. అతనికి ఏ బ్యాక్ గ్రౌండ్ లేదు. చిన్న మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి బెంగళూరులో జాబ్స్ చేసుకుంటూ హీరో కావాలనే తన కల నిజం చేసుకున్నాడు. ఇండస్ట్రీకి రావాలనుకునే యువతకు కిరణ్ అబ్బవరం స్ఫూర్తిగా నిలిచాడు. హిట్స్ మీద హిట్స్ అందుకుంటున్నా, వినయంగా, అణకువగా ఉంటున్నాడు. ఇండస్ట్రీకి ఇలాంటి వాళ్లే కావాలి. కిరణ్ ను చూస్తుంటే కెరీర్ బిగినింగ్ లో చిరంజీవి గారు గుర్తొస్తున్నారు. 150కి పైగా సినిమాలు చేసినా, త్వరలో భారతరత్న అందుకోబోతున్నా చిరంజీవి గారు ఎంత హంబుల్ గా ఉంటారో మనకు తెలుసు. కిరణ్ తను చేసిన ప్రతి సినిమాను కొత్త డైరెక్టర్ తోనే చేస్తున్నాడు. మట్టిలో మాణిక్యాల్లాంటి డైరెక్టర్స్ ను బయటకు తీసుకొస్తున్నాడు. కిరణ్ ను చూస్తుంటే ముచ్చటేస్తోంది. కిరణ్ ను చూసి మిగతా హీరోలు కొత్త డైరెక్టర్స్ ను పరిచయం చేయాలి. ఆరుగురు కొత్త దర్శకులను కిరణ్ పరిచయం చేశాడు. కె ర్యాంప్ నిజంగా కె ర్యాంప్ అనిపించే విజయాన్ని అందుకుంది. ప్రొడ్యూసర్స్ రాజేశ్, శివ ఇలాంటి హిట్స్ మరిన్ని ప్రొడ్యూస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్ రాజేశ్ దండ మాట్లాడుతూ – ఇది నా జీవితంలో సంతోషకరమైన రోజు. డిస్ట్రిబ్యూటర్ గా నా కెరీర్ మొదలుపెట్టాను. ఈ రోజు నిర్మాతగా నా డిస్ట్రిబ్యూటర్స్ కు షీల్డ్స్ అందివ్వడం మర్చిపోలేను. గతేడాది క సినిమాతో కిరణ్ గారు హిట్ కొట్టారు. ఆ తర్వాత ఆయన ఏ నిర్మాతకైనా సినిమా చేయొచ్చు. కానీ మాకు ఇచ్చిన మాట ప్రకారం మంచి కథను నా దగ్గరకు పంపారు. “K-ర్యాంప్” సినిమా హిట్ అవుతుందని ఒక ఈవెంట్ లో తొడగొట్టి చెప్పాను. ప్రేక్షకులు మా నమ్మకాన్ని నిజం చేస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చారు. ఈ విజయం మా కిరణ్ గారికే దక్కుతుంది. మా టీమ్ అంతా సినిమాను ప్రేమించి వర్క్ చేశారు. హీరోయిన్ యుక్తి తన పర్ ఫార్మెన్స్, డ్యాన్సులతో ఆకట్టుకుంది. నా డిస్ట్రిబ్యూటర్స్ అంతా మంచి థియేటర్స్ ఇచ్చి ఈ దీపావళి కె ర్యాంప్ దీపావళి అని ప్రూవ్ చేశారు. టీజర్ రిలీజ్ ఫంక్షన్ లో జైన్స్ నాని హరీశ్ శంకర్ లాంటి డైరెక్టర్ అవుతాడని చెప్పాను. అది నిజమైని ప్రూవ్ అయ్యింది. మా హీరో కిరణ్ గారు మాకు ప్రొడక్షన్ వైపు ఎంతో సపోర్ట్ చేశారు. హీరోగానే కాదు ఒక ప్రొడ్యూసర్ గా ఇన్వాల్వ్ అయ్యేవారు. కిరణ్ నిజాయితీగా ఉంటారు, మీరు ఇంకా మరిన్ని హిట్ చిత్రాలు చేయాలని, ఇంకా పెద్ద స్టార్ కావాలని కోరుకుంటున్నా. మీ జర్నీలో ప్రతి ఏడాది ఒక సినిమా మా బ్యానర్ లో ఉంటుందని ఆశిస్తున్నా. మీడియా వాళ్లంతా మాకు మిత్రులే. కొన్ని మీడియా సంస్థల గురించి నేను ఏదైనా పొరపాటు మాట్లాడితే ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నా, మా బ్యానర్ లో వరుసగా సినిమాలు లైనప్ లో ఉన్నాయి. మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – మా అందరికీ హ్యాపీ ఈవెనింగ్ ఇది. “K-ర్యాంప్” సక్సెస్ సెలబ్రేషన్స్ కు మా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, టీమ్ అందరూ వచ్చారు. మా సినిమా విజయాన్ని మా కంటే మీరంతా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. మా టీమ్ అంతా ఒక ఫ్యామిలీలా మారిపోయాం. “K-ర్యాంప్” సినిమా మనకు అన్నీ నేర్పింది. సంతోషాలు, ఒడిదొడుకులు..ఏవి ఎదురైనా మనమంతా కలిసే ఉన్నాం, ముందుకెళ్తున్నాం. ఈ సక్సెస్ మనందరికీ చాలా ముఖ్యం. ఈ సక్సెస్ ను మరికొన్ని రోజులు ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నా. డైరెక్టర్ నాని విషయంలో హ్యాపీగా ఉన్నాను. కొత్త డైరెక్టర్ కు సక్సెస్ వస్తే అతనితో పాటు అతని ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఫీలవుతారో తెలుసు. నాని మరిన్ని హిట్ చిత్రాలు చేయాలి. మా ప్రొడ్యూసర్స్ స్ట్రాంగ్ గా నిలబడినందుకే ఈ రోజు ఇంత పెద్ద సక్సెస్ మాకు దక్కింది. ఐదు నెలల్లో సినిమా ఎలా కంప్లీట్ అయ్యిందో తెలియలేదు.
మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా అందరం హ్యాపీగా ఉన్నామంటే అందుకు కారణం మా ప్రొడ్యూసర్స్ రాజేశ్, శివ గారు. మొండి ధైర్యంతో వాళ్లు సినిమాను ముందుకు తీసుకెళ్లారు. మనం కలిసి మళ్లీ మూవీస్ చేద్దాం. నాకు ఇంకా పెద్ద సక్సెస్ లు రావొచ్చు గానీ కె ర్యాంప్ సినిమా మాత్రం ఎప్పటికీ ప్రత్యేకంగా మిగిలిపోతుంది. ఈ సినిమా ఎంత వసూళు చేసింది అనేదాని కంటే థియేటర్స్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా కలిసి సినిమా చూస్తూ నవ్వుకోవడం హీరోగా ఎంతో సంతృప్తిని ఇచ్చింది. పండక్కి మీ అందరినీ ఎంటర్ టైన్ చేయాలనే సినిమా చేశాం. ఆ నమ్మకం నిజం కావడం హ్యాపీగా ఉంది. మీ వాడిగా భావించి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. గతేడాది, ఈ ఏడాది దీపావళికి హిట్ ఇచ్చాం. మీ సపోర్ట్ ఉంటే వచ్చే దీపావళికి కూడా హిట్ సినిమా ఇస్తాను. అన్నారు.







