టాలీవుడ్లో అర్జున్ ఓ ప్రయోగం
అర్జున్ టాలీవుడ్లో ఓ ప్రయోగం చేయనున్నాడట. అర్జున్ గారాలపట్టి ఐశర్య అర్జున్ను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాడట. ఆ సినిమాకు అర్జునే దర్శకత్వం వహిస్తుండటం ఇక్కడ మరో విశేషం. నటిగా ఐశ్వర్య అర్జున్ ఇప్పటికే తెరంగేట్రం చేసింది. తమిళ, కన్నడ చిత్రాల్లో నటిగా ప్రూవ్ చేసుకున్న ఐశ్వర్య- తెలుగులోకి అడుగుపెట్టే ప్రయత్నాలు చేసినా ఇంతవరకూ వర్కౌట్ కాలేదు. అందుకే ఐశ్వర్యను అర్జునే స్వయంగా తెరంగ్రేటం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడన్న సమాచారం వినిపిస్తోంది. అందుకోసం అర్జున్ నిర్మాతగానూ మారనున్నట్టు తెలుస్తోంది. ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్‌తో భాగస్వామిగా ఐశ్వర్య అర్జున్‌తో ప్రాజెక్టు చేసే అవకాశముందన్నది తాజా సమాచారం.













