ప్రభాస్ తల్లిగా అలనాటి కలల రాణి హేమ మాలిని
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న భారీ పాన్ ఇండయా మూవీ ‘ఆదిపురుష్’లో ప్రస్తుతానికి సైఫ్ అలీ ఖాన్ పాత్ర మాత్రమే ఖరారైంది. రాముడిగా ప్రభాస్, లంకేశ్‌గా సైఫ్ పేర్లను తప్ప మిగిలిన పాత్రధారులను చిత్ర యూనిట్ ఇప్పటి వరకు ప్రకటించలేదు.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకటి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రాధేశ్యామ్’ కాగా.. మరొకటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సలార్’. ఇక మూడో సినిమా ‘ఆదిపురుష్’ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో చేస్తున్నారు. ‘ఆదిపురుష్’ సినిమాకు సంబంధించి ఇటీవల వీఎఫ్ఎక్స్ సీన్స్ చిత్రీకరణను ముంబైలో ప్రారంభించారు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ఈ సీన్స్‌ను చిత్రీకరించారు. అయితే, అక్కడ భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో తాత్కాలికంగా షూటింగ్‌కు బ్రేక్ పడింది. రామాయణం నేపథ్యంతో రూపొందుతోన్న ‘ఆదిపురుష్’లో రాముడిగా ప్రభాస్ కనిపించనున్నారు.
ప్రభాస్ రాముడు అయితే ఆయన తల్లి కౌశల్య పాత్రలో అలనాటి అందాల తార, బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని ప్రభాస్ తల్లిగా కనిపించబోతున్నారట. ఆమె 2017 లో వచ్చిన గౌతమి పుత్ర శాత కర్ణి లో కూడా తల్లిగా నటించి మెప్పించారు. తాజాగా కౌశల్య పాత్ర కోసం దర్శక నిర్మాతలు హేమమాలిని సంప్రదించారట. ఆమె కూడా అంగీకారం తెలిపారని అంటున్నారు.భారీ పాన్ ఇండియా మూవీగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ రూపొందిస్తోన్న సినిమా కాబట్టి కచ్చితంగా ఆయన ప్రముఖ నటీనటులనే తీసుకుంటారు. అందులో భాగంగానే కౌశల్య పాత్రకు హేమమాలినీని ఎంపిక చేసుకున్నారని టాక్. మిగిలిన నటీనటులు కూడా పాపులర్ యాక్టర్సే ఉంటారని టాక్. ఇప్పటికే మెయిన్ విలన్‌గా సైఫ్ అలీ ఖాన్‌ను తీసుకున్నారు. లంకేశుడిగా ఆయన కనిపించనున్నారు.కాగా, ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని దర్శక నిర్మాతలు ప్రకటించాల్సి ఉంది. అంటే, సీతగా ఎవరు నటిస్తారు అనేది ఆసక్తికరం. ఈ సినిమాను భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, రాజేష్ నాయర్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యం.యం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఫలణి కార్తీక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.













