హలో… నీకోసమే!
రామ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం హలో గురు ప్రేమకోసమే. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. శిరీష్, లక్ష్మణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దిల్‌రాజు సమర్పిస్తున్నారు. దసరా సందర్భంగా వచ్చే నెల 18న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవలే టీజర్‌ని విడుదల చేశారు. అందులో చూశావా, నీ కోసమే.. అంటూ ఊరించి వేడి కాఫీ రుచి చూపించిన అనుపమ పరమేశ్వరన్ అందంతో ఆకట్టుకుంది. ఒక రొమాంటిక్ ప్రేమకథతో ఈ చిత్రం తెరకెక్కినట్టు సృష్టమవుతోంది. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రహణం : విజయ్ కె.చక్రవర్తి.













