వెబ్‌సిరీస్ లో హెబ్బా పటేల్
వెబ్‌సిరీస్‌లపై ఇపుడు స్టార్స్, సూపర్‌స్టార్స్ కూడా వెబ్‌సిరీస్‌లపై ఆసక్తి చూపుతున్నారు. సినిమాల స్థాయిలో వెబ్ సిరీస్‌లను చేస్తున్నారు. దాంతో స్టార్లు కూడా వెబ్‌సిరీస్‌లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక సినిమాల్లో ఛాన్స్ లేని హీరోయిన్లు, నటులకు వెబ్‌సిరీస్‌లు ఒక వరంగా మారాయి. పలువురు హీరోయిన్లు వెబ్‌సిరీస్ బాటపడుతున్నారు. వీరి జాబితాలో ముద్దుగుమ్మ హెబ్బాపటేల్ కూడా చేరింది. కుమారి 21ఎఫ్ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడు ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసినా కూడా పెద్దగా సక్సెస్‌లు దక్కించుకోలేకపోయింది. అడపా దడపా చిత్రాలు చేస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం నితిన్ చిత్రంలో నటిస్తోంది. ఒకవైపు హీరోయిన్గా చేస్తూనే మరోవైపు వెబ్‌సిరీస్‌ను చేసేందుకు కమిట్ అయ్యింది. అజయ్ భుయాన్ దర్శకత్వంలో రూపొందబోతున్న వెబ్‌సిరీస్‌తో హెబ్బాపటేల్ తన కొత్త జరన్నీ ప్రారంభింంచబోతోంది.













