డబుల్ ఇస్మార్ట్‌కు పెరుగుతున్న పోటీ
ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాకు పెద్ద చిక్కే ఏర్పడుతుంది. పోటీపరంగా ఈ సినిమాకు ఎదురవుతున్న సవాళ్లు డబుల్ ఇస్మార్ట్ కు కఠిన పరీక్ష పెట్టేలా అనిపిస్తుంది. ఇప్పటికే విక్రమ్ తంగలాన్ ఆగస్ట్ 15కి ఫిక్స్ అయింది. దీంతో పాన్ ఇండియాలో మంచి రిలీజ్ ఉండేలా చూస్తున్న డబుల్ ఇస్మార్ట్ టీమ్ కు తమిళనాడు, కేరళలో చిక్కు తప్పేలా లేదు. తెలుగులో 35, ఆయ్ అనే సినిమాలు కూడా అదే రోజున రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటూ రీసెంట్ గా రవితేజ మిస్టర్ బచ్చన్ కూడా అదే డేట్ ను ఫిక్స్ చేసుకుంది. బాలీవుడ్ లో స్త్రీ2 మీద కూడా అంచనాలున్నాయి. నార్త్ మార్కెట్ లో స్త్రీ2, డబుల్ ఇస్మార్ట్ మీద ఎఫెక్ట్ చూపడం ఖాయం. ఇది కాకుండా ఖేల్ ఖేల్ మే, వేదా సినిమాలు కూడా అదే టైమ్ లో రానున్నాయి.
బాక్సాఫీస్ వద్ద కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా పోటీ ఉండటం డబుల్ ఇస్మార్ట్ ఓపెనింగ్స్ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. వీటన్నింటినీ తట్టుకుని డబుల్ ఇస్మార్ట్ నిలబడాలంటే కచ్ఛితంగా సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావాల్సిందే. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు సినిమాపై అంచనాలను పెంచడంతో, ట్రైలర్ ను కూడా చాలా జాగ్రత్తగా కట్ చేయిస్తున్నాడట పూరీ. రామ్, పూరీ ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. మరి వారి అంచనాలను డబుల్ ఇస్మార్ట్ ఏ మేరకు అందుకుంటుందో చూడాలి.













