స్పీడ్ పెంచిన సుధీర్ బాబు: ఇంద్రగంటి తో హాట్ట్రిక్ మూవీ
యంగ్ హీరో సుధీర్ బాబు డిఫరెంట్ స్టయిల్లో విభిన్నమైన పాత్రలతో స్పీడ్ అందుకున్నాడు. శ్రీ దేవి సోడా సెంటర్ తరువాత టాలెంటెడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబోలో మరో సినిమా చేయబోతున్నాడువీరిది హాట్ట్రిక్ సినిమా. తాజాగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. తనదైన నటనా ప్రతిభతో మాస్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైన యంగ్ అండ్ డైనమిక్ హీరో సుధీర్ బాబు మరోసారి టాలెంటెడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణతో జత కట్టారు. వీరిద్దరి కాంబోలో రాబోయే మరో సినిమాను దీపావళి కానుకగా అఫీషియల్‌గా ప్రకటించారు. గతంలో వీరిద్దరి కాంబోలో ”సమ్మోహనం, V” సినిమాలు వచ్చాయి. సుధీర్ బాబు కోసం వైవిద్యభరితమైన కథ రెడీ చేసిన డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ.. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట.
బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1గా ఈ సినిమా రూపొందనుంది. చిత్రంలో సుధీర్ బాబు సరసన క్రితి శెట్టి హీరోయిన్గా నటించనుండగా వివేక్ సాగర్ సంగీతం అందించబోతున్నారు.రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న ఈ సినిమాపై అటు ఇంద్రగంటి, ఇటు సుధీర్ బాబు స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారట. అదేవిధంగా ఈ మూవీ లిరిక్స్‌పై ప్రత్యేక శ్రద్ద పెట్టిన ఇంద్రగంటి.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి, రామ జోగయ్య శాస్త్రిలకు ఆ బాధ్యతలు అప్పగించారు. సుధీర్ బాబు కెరీర్లో 14వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు రానుంది. అతిత్వరలో ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనుంది చిత్రయూనిట్.













