Harsha Vardhan: సందీప్ లేకుండా ఆయన వల్ల అవుతుందా?
సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్(Animal) సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసిన హర్షవర్ధన్ రామేశ్వర్(Harshavardhan Rameshwar) ఎంత మంచి అవుట్పుట్ ఇచ్చాడో అందరికీ తెలిసిందే. యానిమల్ మ్యూజిక్ నుంచి బీజీఎం వరకూ ప్రతీ దాంట్లో తన దైన మార్క్ చూపించాడు. సినిమాలోని డల్ సీన్స్ ను కూడా హర్షవర్ధన్ తన బీజీఎంతో ఎలివేట్ చేసి సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాడు.
యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమాకు కూడా హర్షవర్ధన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. స్పిరిట్ సినిమాకు హర్షవర్ధన్ ఎలాంటి మ్యూజిక్ అందిస్తాడా అని అందరూ ఎదురుచూస్తున్న టైమ్ లో ఇప్పుడాయన షారుఖ్ ఖాన్(Shahrukh Khan) కింగ్(King) సినిమాను సంగీతాన్ని అందిస్తున్నాడని వార్తలొస్తున్నాయి. కింగ్ కు అనిరుధ్(Anirudh) బీజీఎం ఇస్తుండగా, హర్షవర్ధన్ సాంగ్స్ కోసం వర్క్ చేస్తున్నాడని అంటున్నారు.
దీంతో ఇప్పుడు అందిరినీ ఓ ప్రశ్న వెంటాడుతుంది. సందీప్ లేకుండా హర్షవర్ధన్ మంచి మ్యూజిక్ ను ఇవ్వగలడా లేదా అన్నది అందరికీ ప్రశ్నగా మారగా, సందీప్ లేకపోయినా హర్షవర్ధన్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయగలడని కొందరంటుంటే మరికొందరు సందీప్ వల్లే ఆయన అంత ఫేమస్ అయ్యాడని అంటున్నారు. మరి కింగ్ కు హర్షవర్ధన్ ఎలాంటి సంగీతం ఇస్తాడో చూడాలి.













