Roshan: రోషన్ కు భలే ఛాన్సు దక్కిందిగా
నేచురల్ స్టార్ నాని(Nani) నిర్మాణంలో వచ్చిన కోర్టు మూవీలో గొప్ప నటనను కనబరిచిన హర్ష్ రోషన్(Harsh Roshan) ఆ మూవీలో తన యాక్టింగ్ తో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని మెప్పించడంతో పాటూ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. కోర్టు మూవీ సూపర్ హిట్ అవడంతో పాటూ ఆ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే.
కోర్టు మూవీ కమర్షియల్ గా కూడా హిట్ అవడంతో టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు(Dil Raju), హర్ష్ రోషన్ ను సంప్రదించి అతనితో ఓ సినిమాకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఏపీలో రెండు దశాబ్ధాల ఏళ్ల కిందట జరిగిన ఓ పీరియాడికల్ ప్రేమ కథను దిల్ రాజు నిర్మించనున్నారని తెలుస్తోంది.
ఆ మూవీ కోసమే దిల్ రాజు హర్ష్ రోషన్ తో డీల్ సెట్ చేసుకున్నారని అంటున్నారు. తెల్ల కాగితం(Thella Kaagitham) అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు రమేష్(Ramesh) అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించనున్నాడు. దిల్ రాజు డ్రీమ్స్(Dil Raju Dreams) బ్యానర్ లో అరుణాచల్ క్రియేషన్స్(Arunchal Creations) లో కృష్ణ కొమ్మాలపాటి(Krishna Kommalapati) ఈ మూవీని నిర్మించనున్నారని, వేసవి నుంచి ఈ సినిమా మొదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.













