ఓటీటీలో హిట్ కొట్టిన సుధీర్
కొన్ని సినిమాలు థియేటర్లో ఉన్నప్పుడు ఆడియన్స్ పట్టించుకోరు. దాంతో కొన్ని రోజుల పాటూ ఆడి ఆ సినిమాలు వాషౌట్ అయిపోతాయి. తర్వాత అవే సినిమాలు ఓటీటీలోనో, టీవీలోనో వచ్చినప్పుడు మాత్రం వాటికి మంచి ఆదరణ దక్కుతుంది. సినిమా బాగుందే ఎందుకు ఆడలేదు అని షాకవుతుంటారు. సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ హరోంహర విషయంలో ఇదే జరుగుతుంది.
గత నెలలో హరోం హర రిలీజైనప్పుడు ఆడియన్స్ దీన్ని లైట్ తీసుకున్నారు. దాంతో పాటుగా రిలీజైన డబ్బింగ్ సినిమా మహారాజాను విరగబడి చూశారు. దాని జోరు ముందు సుధీర్ సినిమా నిలవలేకపోయింది. ఓపెనింగ్స్ అయితే ఫర్వాలేదనిపించాయి కానీ అనుకున్న స్థాయిలో సినిమా ఆడలేదు. దీంతో ఫస్ట్ వీకెండ్ తర్వాత ఎవరూ ఈ సినిమా గురించి మాట్లాడలేదు.
రీసెంట్ గా ఈ సినిమా ప్రైమ్ వీడియాలో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇండియా లెవెల్ లో హరోంహర టాప్ లో ట్రెండ్ అవుతున్నట్లు ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసింది. పెద్ద పెద్ద సినిమాలతో పోటీ పడి మరీ ఈ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. అన్ని భాషల ఆడియన్స్ ఈ సినిమాను చూస్తున్నారు. అంతేకాదు సినిమాను చూసి ఆ సినిమాలో సీన్స్ గురించి సోషల్ మీడియాలో డిస్కస్ చేస్తున్నారు. ఈ సినిమాను రిలీజ్ టైమ్ లో ఇంకాస్త ప్రమోట్ చేసి ఉంటే థియేటర్లలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.













