మరోసారి పవన్ కళ్యాణ్ అభిమానుల్ని ఉర్రూతలూగించనున్న హరీష్ శంకర్!
త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన ‘అజ్ఞాతవాసి’ తర్వాత రాజకీయాఉర్రూతలూగించనున్నల్లో పూర్తిగా బిజీగా అయిన పవన్ కళ్యాణ్.. సార్వత్రిక ఎన్నికలకు మరింత సమయం ఉండటంతో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ చిత్రం ద్వారా రీఎంట్రీతో ఫుల్ స్పీడుతో దూసుకుపోతున్నాడు. ఈ సినిమా పట్టాలపై ఉండగానే క్రిష్ జాగర్లమూడితోనూ, హరీశ్ శంకర్‌తోనూ సినిమాలను ప్రకటించాడు. ఆ తర్వాత ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ ప్రకటించి.. దాన్ని వెంటనే ప్రారంభించాడు. ఈ సినిమాల షూటింగ్‌లు ఒక్కొక్కటిగా పూర్తి చేసేలా పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్.
టాలీవుడ్లో మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన అతి తక్కువ దర్శకుల్లో హరీశ్ శంకర్ ఒకరు. మాస్ ఆడియన్స్ ను మెప్పించడమనేది ఆయన టైటిల్ దగ్గర నుంచే మొదలుపెడతాడు. వరుసగా మెగా హీరోలతోనే హ్యాట్రిక్ హిట్ ను దక్కించుకున్న హరీశ్ శంకర్, పవన్ తో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ‘గబ్బర్ సింగ్’ సినిమా నుంచి పవన్ పట్ల విపరీతమైన అభిమానాన్ని చూపుతూ వస్తున్న హరీశ్ శంకర్, ఆయనతో మరో సినిమా చేయాలనే ఆసక్తిని ఎప్పటి నుంచో కనబరుస్తూ వస్తున్నాడు. పవన్ రీ ఎంట్రీ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన హరీశ్ శంకర్, ఇటీవల ఆయనకి ఒక పక్కా మాస్ కథను వినిపించి ఓకే అనిపించుకున్నాడు.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ అయిన వెంటనే గాల్లో తేలిపోయారు అభిమానులు. జూన్ మొదటివారంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకోనున్నట్టుగా తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే టైటిల్ కూడా రిజిష్టర్ చేయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కెరీర్లోనే తొలిసారి లెక్చరర్ పాత్రలో నటించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. పవర్ స్టార్ ఇమేజ్‌కు సరిపోయేలా పవర్ ఫుల్ కథను సిద్ధం చేస్తున్నాడట దర్శకుడు హరీష్ శంకర్. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.













