కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్లు మళ్లీ ఇన్నేళ్లకి..
షాక్ సినిమాతో రవితేజ హీరోగా, హరీష్ శంకర్ డైరక్టర్ గా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ సినిమా పరాజయం పాలైనా, ఆ తర్వాత మళ్లీ మిరపకాయ్ అనే సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నారిద్దరూ. ఆ తర్వాత నుంచి వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయాలని అనుకుంటున్నప్పటికీ అది ఎందుకో కుదరలేదు. అప్పట్లో మిరపకాయ్ కు సీక్వెల్ చేస్తారని న్యూస్ వచ్చింది కానీ అవి కేవలం రూమర్స్ గానే మిగిలాయి.
ఈ తరుణంలోనే వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయని ఇప్పుడు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. రవితేజ కోసం ఒక స్టోరీని రెడీ చేసిన హరీష్, రీసెంట్ గా అది ఆయనకు నెరేట్ కూడా చేశాడట. రవితేజ ఆ కథకు పాజిటివ్ గా రెస్పాండ్ అయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటున్నారు. రవితేజకు తగ్గట్లుగా, ఎంటర్టైన్మెంట్ తో పాటుగా కమర్షియల్ గా కూడా ఈ సినిమా ఉండనుందనుకుంటున్నారు. ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో రెండో సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
గబ్బర్ సింగ్ తర్వాత వీరి కలయిక లో రానున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత రవితేజ తో సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. రవితేజ కూడా ప్రస్తుతం ఖిలాడీ సినిమా చేస్తున్నాడు. ఉగాది రోజున శరత్ మండవ డైరక్షన్ లో ఒక సినిమాను లాంఛనంగా ప్రారంభించాడు.













