సంచలనం సృష్టించడానికి మరోసారి గబ్బర్‌సింగ్ మన ముందుకు రాబోతున్నాడా?
పవన్‌కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్‌సింగ్ ఎన్ని సంచలనాలు, ఎన్ని రికార్డులు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా పవర్‌స్టార్ ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగించింది. ఈ సినిమాలోని పాటలుగానీ, డైలాగ్స్‌గానీ ఎంత పాపులర్ అయ్యాయంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఈ సినిమాలోని డైలాగ్స్‌ని వాడేవారు. వాస్తవానికి ఈ సినిమా రీమేకే అయినప్పటికీ దానికి ఎన్నో హంగులు అద్దాడు హరీష్‌శంకర్. గబ్బర్‌సింగ్ రిలీజ్ అయినప్పటి నుంచి మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూశారు. అయితే ఆరోజు రానే వచ్చింది. పవన్‌కల్యాణ్ పుట్టినరోజున తాను చేయబోయే సినిమాలకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌లను రిలీజ్ చేశాడు. అందులో హరీష్ శంకర్ కాంబినేషన్లో చేయబోయే సినిమా కూడా వుంది.
ఈ ఎనౌన్స్మెంట్ రాగానే పవన్ ఫ్యాన్స్‌లో పండగ వాతావరణం నెలకొంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు మరో న్యూస్ వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో పవన్ కల్యాణ్ మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే కొన్ని సీన్స్‌లో పవన్ అలా కనిపిస్తాడట.
గబ్బర్‌సింగ్‌లో పవన్‌కల్యాణ్ క్యారెక్టర్ని డిఫరెంట్‌గా డిజైన్ చేసినట్టుగానే ఈ సినిమాలో కూడా కొత్తగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇక ఈ విషయం తెలిసిన తర్వాత ఇప్పటి నుంచే హై ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. పవర్‌స్టార్ ఫ్యాన్స్ ఈ విషయంలో మరింత ఆనందంగా ఉన్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో, ఆడియన్స్ ఎలా ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి.













