రైడ్ రీమేక్ ఉన్నట్టే అనిపిస్తోందిగా!
సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ పోయే రవితేజ ప్రస్తుతం ఈగల్ సినిమా చేస్తున్నాడు. దీంతో పాటూ రీసెంట్ గా మలినేని గోపీచంద్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో మరో సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ సినిమాకు బడ్జెట్ ఎక్కువ అవుతున్న కారణంగా నిలిపేశారని టాక్ వస్తుంది.
అయితే సినిమాను తాత్కాలికంగా నిలిపేశారా లేదా మొత్తానికే ఆపేశారా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా ఇప్పట్లో లేదు కాబట్టి ఈ ప్లేస్ లో రవితేజ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో బాలీవుడ్ హిట్ మూవీ రైడ్ ను రీమేక్ చేయాలని చూస్తున్నాడట. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ వార్త ఎప్పుడో వచ్చింది కానీ తర్వాత ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో సినిమా లేదనుకున్నారు.
కానీ ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అజయ్ దేవగణ్ నటించిన రైడ్ సినిమా బాలీవుడ్ లో మంచి హిట్ అయింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఇప్పటికే ధమాకా, ఈగల్ చేసిన రవితేజ మొత్తం మూడు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల రైడ్ సినిమా తెర మీదకు వచ్చినట్లు తెలుస్తోంది. పైగా బడ్జెట్ పరంగా కూడా ఎలాంటి రిస్క్ ఉండదు. షూటింగ్ కూడా త్వరగా కంప్లీట్ చేసేయొచ్చు. ఎటు చూసినా రైడ్ సినిమా సేఫ్ గేమ్ లాంటిదే. ఏదేమైనా ఈ వార్తల్ని అధికారిక ప్రకటన వచ్చేవరకు నమ్మలేం.













