అంచనాలకు మించేలా ఉస్తాద్ భగత్ సింగ్
పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్, హరీష్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అందరికీ భారీ అంచనాలున్నాయి.
దానికి తగ్గట్లే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కూడా ఫ్యాన్స్ కు మంచి జోష్ ను ఇవ్వడంతో సినిమాపై అంచనాలు ఇంకా పెరిగాయి. ఇదిలా ఉంటే హరీష్ శంకర్ ఈ సినిమా గురించి ఫ్యాన్స్ తో స్పెషల్ చిట్ చాట్ చేశారు. అందులో భాగంగా హరీష్ పలువురు ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు.
ఉస్తాద్ భగత్ సింగ్ రీమేకా కాదా అని అడిగితే దానికి సమాధానంగా నాపై నమ్మకం ఉంచండి, మీ ఎదురుచూపులకు తగ్గ సినిమాను నేను మీకు అందిస్తా. ఈ సినిమా విషయంలో మీరెన్ని అంచనాలు పెట్టుకున్నా వాటిని ఉస్తాద్ భగత్ సింగ్ కచ్ఛితంగా అందుకుంటుందని హరీష్ పేర్కొన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ గబ్బర్ సింగ్ లా ఉంటుందా అని మరొకరు ప్రశ్నించగా, దానికి సమాధానంగా పని చేయడం మాత్రమే మన చేతుల్లో ఉంటుందని ఫలితం మన చేతుల్లో ఉండదని హరీష్ చెప్పుకొచ్చాడు.













